పెరిగిన పెట్రోల్ ధర, 7 పైసలు తగ్గిన డీజిల్
న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు మరోసారి పెరిగాయి. అదే సమయంలో డీజిల్ ధర మాత్రం తగ్గింది. లీటరు పెట్రోల్ పైన 28 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ ధర లీటర్‌కు 6 పైసలు తగ్గింది. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి.
ఇటీవలె పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండుసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత నెల ఎక్కువ పెరిగాయి. ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రిన ధరలు ఎక్కవగా పెరిగాయి. నాడు పెట్రోల్ పైన లీటర్‌కు రూ.3.38 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.67 పైసలు పెరిగింది.

గత రెండు నెలల్లో పెట్రోల్ ధరలు పెరగడం మూడోసారి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.64.57 పైసలుగా ఉంటుంది. శుక్రవారం వరకు రూ.64.21 పైసలుగా ఉంది. డీజిల్ రూ.52.52 పైసలుగా ఉంటుంది. శుక్రవారం వరకు డీజిల్ లీటర్ రూ.52.59 పైసలుగా ఉంది.












Click it and Unblock the Notifications