వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు ధరల్లోకి పెట్రోల్, డీజీల్: 4 ఏళ్ళ తర్వాత గరిష్ట ధరలు, తగ్గేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు మరోసారి పెరిగాయి. నాలుగేళ్ళ గరిష్టానికి పెట్రోల్ ధర చేరుకొంది. డీజీల్ ధర కూడ అదే రీతిలో అత్యధిక ధరకు చేరుకొంది. ప్రతి రోజూ పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షిస్తున్నారు. ఆదివారం నాడు న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.73, డీజీల్ కు టీటర్‌ రూ.64.58కు చేరుకొంది.

ఢిల్లీలో పెట్రోల్, డీజీల్ ధరలు ఆదివారం నాడు 18 పైసలు పెరిగాయి. 2014 సెప్టెంబర్ 14 తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఇదే అధికంగా రికార్డైంది. డీజీల్ దర కూడ గరిష్టానికి చేరుకొంది 2018 ఫిబ్రవరి 7న ఢిల్లీలో అత్యధికంగా డీజీల్ ధర రూ.64.22గా నమోదైంది. ఆదివారం నాడు4 ఏళ్ళ తర్వాత అత్యంత ఎక్కువ ధర లీటర్ డీజీల్‌ను విక్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఆదివారం నాడు లీటర్ డీజీల్ న్యూఢిల్లీలో రూ.64.58కు చేరుకొంది.

Petrol price hits 4-yr high, diesel at highest level

2017 అక్టోబర్‌ మాసంలో కేంద్ర ప్రభుత్వం చమురుపై విధిస్తున్న సుంకాన్ని లీటర్‌పై రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. అయినా పెట్రోల్, డీజీల్ ధరల్లో తగ్గుదల లేకుండా పోయింది. మరోవైపు ఆయా రాష్ట్రాలు కూడ పెట్రోల్, డీజీల్‌పై వేసే పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. కానీ, రాష్ట్రాలు మాత్రం పన్నుల భారాన్ని తగ్గించడం లేదు.

ఇదిలా ఉంటే పెట్రోల్, డీజీల్‌లను కూడ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్‌ కూడ లేకపోలేదు. ఈ విషయమై ఆలోచన చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ గతంలో ప్రకటించారు. కానీ, ఈ విషయం ఆచరణలోకి రాలేదు. జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజీల్‌ తీసుకురావడం వల్ల వినియోగదారులకు చౌకగా పెట్రోల్, డీజీల్ లభ్యమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Petrol price today hit a four-year high of Rs 73.73 a litre while diesel rates touched an all-time high of Rs 64.58 in the national capital, renewing calls for the government to cut excise tax rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X