రూ.87.77: పెట్రోల్, డీజిల్ ధరల కొత్త రికార్డులు, ఏ సిటీలో ఎంతంటే?
Recommended Video

న్యూఢిల్లీ: రోజు రోజుకూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే లీటర్ పెట్రోల్‌పై 48 పైసలు పెరగగా.. శనివారం ఉదయం మరో 39 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80ని దాటింది.
శనివారం నాటి ఆయిల్ కంపెనీల ధరల ప్రకారం.. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38గా ఉంది. ముంబైలో అత్యధికంగా రూ. 87.7 నమోదైంది. చెన్నైలో రూ. 83.54, కోల్‌కతాలో రూ. 83.27, హైదరాబాద్‌లో రూ. 85.23గా ఉంది.

ఇక డీజిల్ కూడా శనివారం 44 పైసలు పెరిగి ఢిల్లీలో లీటర్ ధర రూ. 72.51గా ఉంది. ముంబైలో రూ. 76.98, చెన్నైలో రూ. 76.64, కోల్‌కతాలో రూ. 75.36, హైదరాబాద్‌లో రూ. 78.87గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.36పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.79.65గా ఉంది.
ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో పాటు రవాణా సుంకాలు అధికంగా ఉండటంతో దేశంలో ఇంధన ధరలు పైపైకి పోతున్నాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్ ధరలకు నిరసనగా ఈ నెల 10న దేశవ్యాప్త బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications