షాక్: 55 నెలల గరిష్టానికి చేరుకొన్న పెట్రోల్ ధరలు, అదే బాటలో డీజీల్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు మరింత పెరిగాయి. తాజాగా శుక్రవారం నాడు పెరిగిన ధరలతో 55 నెలల గరిష్ట పెరుగుదల పెట్రోల్ ధరలలో నమోదయ్యాయి. ఇక డీజీల్ ధరలలో కూడ ఇదే తరహా అత్యధికంగా ధరలు నమోదయ్యాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజీల్ ధరలు కూడ పెరుగుతున్నాయి.55 నెలల గరిష్టానికి లీటర్ పెట్రోల్ ధరలు చేరుకొన్నాయి. 2013 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

శుక్రవారం నాడు మరోసారి పెట్రోలు ధర 1 పైసలు, డీజిల్ ధర 4 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ లీటరు 74.08 రూపాయలు, కోలకతాలో రూ. 76.78, ముంబైలో రూ. 81.93, చెన్నైలో రూ. 76,85గా ఉంది. డీజిల్ ధరకూడా రికార్డు స్థాయిని తాకింది. ఢిల్లీలో రూ. 65.31, కోలకతాలో 68.01 వద్ద ముంబైలో రూ. 69.54 , చెన్నైలో రూ. 68.90గా ఉన్నాయి.
గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నాటి నుంచి చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్ ధరలు లీటర్ పెట్రోల్ 55 నెలలలో గరిష్ట రేటుకు చేరుకొన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ప్రస్తుతం 73.78 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.
పెట్రోల్, డీజీల్ లను కూడ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజీల్‌లపై రాష్ట్రాలు వేసే పన్నులను తగ్గించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. అయితే రాష్ట్రాలు మాత్రం పన్నుల వసూలును తగ్గించడం లేదు. దీంతో వినియోగదారుడిపై విపరీతమైన భారం పడుతోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications