Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NIA: పీఎఫ్ఐ మీద పంజా విసిరిన ఎన్ఐఏ, ఒకేసారి 56 ప్రాంతాల్లో రైడ్, ఉగ్రవాదులతో టచ్ లో !

తిరువనంతపురం/కేరళ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నాయకుల మీద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం పంజా విసిరింది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పుడుతున్నారని పీఎఫ్ఐని ఐదు సంవత్సరాల పాటు నిషేధించింది. కేంద్ర హోమ్ శాఖా నిషేధం విధించినా గుట్టుచప్పుడు కాకుండా పీఎఫ్ఐ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సమాచారం ఇవ్వడంతో వేకువ జామున ఎన్ఐఏ అధికారులు షాక్ ఇచ్చారు.

పలు రాష్ట్రాల్లో దారుణ హత్యలు

పలు రాష్ట్రాల్లో దారుణ హత్యలు

నిషేధం విదించినా ఇప్పటికీ పీఎఫ్ఐ ఆ సంస్థ కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్ఐఏ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. కుమార్, ప్రవీణ్, రుద్రేష్, బిబిన్, అభిమన్యు, నందు, వి. రామలింగం, సుంజిత్, శరత్ తో పాటు మరి కొందరిని పీఎఫ్ఐ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారని ఆరోపణలు రావడంతో కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక, తమిళనాడు. కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో హిందూ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు.

పీఎఫ్ఐని బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం

పీఎఫ్ఐని బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం

శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న పీఎఫ్‌ఐ కార్యకర్తలు వారి కార్యకలాపాలు కొనసాగించి దారుణ హత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గతంలో చెప్పింది. అంతర్జాతీయ ఉ్రవాదులతో పీఎఫ్ఐ కార్యకర్తలు సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

ఉగ్రవాదులతో సంబంధాలు

ఉగ్రవాదులతో సంబంధాలు

అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలను పెట్టుకున్న కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాలో చేరారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. .పీఎఫ్ఐ కార్యకర్తల కారణంగా కొందరు హత్యకు గురైనారని ఆరోపణలు రావడంతో కేసులు నమోదు అయ్యాయి.

సీక్రేట్ గా కార్యకలాపాలు

సీక్రేట్ గా కార్యకలాపాలు

ఇప్పటికే పీఎఫ్ఐ కార్యకర్తలు కొందరిని ఆయా రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కొందరిని కేంద్ర సంస్థకు చెందిన ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)తో పీఎఫ్‌ఐకి సంబంధాలున్నట్లు సమాచారం అందడంతో ఇదే సంవత్సరం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 150 ప్రాంతాల్లోని పీఎఫ్‌ఐ కార్యకర్తలపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించి అనేక మందిని అరెస్టు చేసింది. గురువారం కేరళలో ఏకకాలంలో 56 ప్రాంతాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+