Pfizer: నాడు పిలిచి పొమ్మన్నారు..ఇప్పుడు రమ్మన్నా రావట్లేదు: లెటర్లు రాసినా బదుల్లేదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇదివరకు లక్షల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇప్పుడు 40 వేలకు దాటట్లేదు. పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. మరణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వల్ల సంభవించే మరణాలు వెయ్యికి దిగవగా నమోదవుతోన్నాయి. రోజురోజుకూ మరణాల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజా బులెటిన్ ప్రకారం..దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 34,703 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 553 మరణాలు రికార్డయ్యాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్న ప్రభావం కరోనా రికవరీ రేటును మెరుగుపరిచిందనే అభిప్రాయాలు ఉన్నయి. ఇప్పటిదాకా 35,75,53,612 మందికి వ్యాక్సిన్ వేశారు.

ఫైజర్‌పై ఆశలు పెట్టుకున్నా..
వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలకు అదనంగా స్పుత్నిక్ వీ కూడా వచ్చి చేరింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను పరిమితంగానే వినియోగిస్తోన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే దీన్ని వాడుతోన్నారు. త్వరలో దీన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి పూర్తిస్థాయిలో అనుమతించే అవకాశాలు లేకపోలేదు. వాటికితోడుగా అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ కంపెనీకి షరతులతో కూడిన నష్ట పరిహారాన్ని అందించడానికి కేంద్రం అంగీకరించిందని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఏకకాలంలో అందుబాటులో రావచ్చొని చెబుతున్నాయి.

రెండుసార్లు లెటర్లు రాసినా..
ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చినా ఫైజర్ కంపెనీ యాజమాన్యం మాత్రం మొండికేసినట్టే కనిపిస్తోంది. భారత్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తామంటూ డీసీజీఐ ఒకటి కాదు..రెండుసార్లు ఫైజర్ యాజమాన్యానికి లేఖలు రాసింది. దీనికి అవసరమైన దరఖాస్తులను దాఖలు చేసుకోవాలంటూ సూచించింది. అయినప్పటికీ- ఫైజర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో- భారత్‌కు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ఫైజర్ ఆసక్తిగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

వచ్చినా.. అంగీకరించలే
ఇదివరకు ఇదే డీసీజీఐ- ఫైజర్ దాఖలు చేసుకున్న దరఖాస్తులను తోసిపుచ్చిన ఉదంతం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పాల్సీ, అనాఫైలాక్సిస్ వంటి ఇతర తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఫైజర్ వల్ల సంభవిస్తాయనే కారణంతో ఆ కంపెనీ యాజమాన్యం దాఖలు చేసుకున్న దరఖాస్తును డీసీజీఐ తోసిపుచ్చింది. ఇప్పుడు అదే ఫైజర్‌కు రెండుసార్లు లేఖలు రాసి ఆహ్వానించినా స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫైజర్ యాజమాన్యం కనీసం.. క్లినికల్, ఇమ్యునోజెనెసిటీ డేటాను గానీ సమర్పించడానికి ఆసక్తి చూపలేదని అంటోన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్‌గా దీనికి గుర్తింపు ఉంది. అమెరికా సహా పలు దేశాలు వ్యాక్సినేషన్ కోసం ఈ టీకాను వినియోగిస్తోన్నాయి.
Recommended Video

ఫైజర్ ఎఫీషియన్సీపై
నిజానికి- అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ పాటికి ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చి ఉండేదే. అదనపు సమాచారం కావాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇచ్చిన సూచనలకు ఫైజర్ అప్పట్లో అంగీకరించలేదు. డీసీజీఐకి దాఖలు చేసుకున్న తన దరఖాస్తులను సైతం వెనక్కి తీసుకుంది. అమెరికా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఫైజర్ టీకానే పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. మోడెర్నా సైతం వినియోగంలో ఉన్నప్పటికీ.. మెజారిటీ వాటా ఫైజర్‌దే. దాని ఎఫీషీయన్సీ కూడా అధికంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications