PG Girl: రాసలీలల ఎఫెక్ట్, పీజీ సుందరి పురాణం, డిటెక్టీవ్ ఏజెన్సీ ఎంట్రీ, 6 వేల ఫోన్ కాల్స్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: పీజీ సుందరితో రాసలీలలు జరిపారని సెక్స్ సీడీ బయటకు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐదు మంది లాయర్లు ,ఇప్పటికే రంగంలోకి దిగిన ముంబాయి డిటెక్టీవ్ ఏజెన్సీ సంస్థ ఇచ్చిన సుమారు 6 వేల మొబైల్ ఫోన్ కాల్స్ రికార్డ్ వాయిస్ కాల్ డేటాతో కథ రసవత్తరంగా మారిపోయింది. మంత్రినే వలలో వేసుకుని ముగ్గులోకి దింపిన పీజీ సుందరితో పాటు ఐదు మందిని ఎస్ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాసలీలల మాజీ మంత్రి సోదరులు అందరూ పార్టీలను పక్కన పెట్టి ఒక్కటి అయిపోవడంతో పీజీ సుందరి అండ్ కోకు ఇప్పుడు డీటీఎస్ సినిమా కనపడుతోంది.

సెక్స్ సీడీ బాంబ్
కర్ణాటక మంత్రిగా పని చేస్తున్న సమయంలో బెంగళూరులోని ఆర్ టీ నగర్ పీజీ సుందరితో నగ్నంగా రాసలీలలు సాగించారని ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జారకిహోళి కేసు రసవత్తరంగా మారింది. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి సెక్స్ సీడీ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ కావడంతో బీజేపీ నాయకులు తలలు పట్టుకున్నారు.

ఎస్ఐటీ ఎంట్రీ
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి సెక్స్ సీడీ వ్యవహారం రచ్చరచ్చ కావడంతో ఆ కేసును కర్ణాటక ప్రభుత్వం SIT అధికారులకు అప్పగించారు. ఇప్పటికే మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల వ్యవహారం కేసు విచారణ ముమ్మరం చేసిన ఎస్ఐటీ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి ఫేమస్ లాయర్లు
రమేష్ జారకిహోళి వ్యవహారంలో సీరియస్ అయిన బీజేపీ హై కమాండ్ మొదట ఆయనతో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. ఢిల్లీలోని ఐదు మంది ప్రముఖ లాయర్లను బెంగళూరుకు పంపించిన బీజేపీ లీడర్స్ రమేష్ జారకిహోళికి న్యాయ సహకారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

ముంబాయి డిటెక్టీవ్ ఏజెన్సీ
తాను ఎవ్వరితో రాసలీలల్లో పాల్గొనలేదని, అది ఒక నకిలీ సీడీ అని ఇప్పటికే రమేష్ జారకిహోళి మీడియాకు చెప్పారు. కేసు నుంచి బయటపడటానికి ఇప్పటికే రమేష్ జారకిహోళి ఆ సీడీ వ్యవహారం గురించి లోతుగా దర్యాప్తు చెయ్యాలని ముంబాయికి చెందిన ప్రముఖ డిటెక్టీవ్ ఏజెన్సీ సంస్థను ఆశ్రయించారు.

సార్ తో 7 వేల మంది మాట్లాడారా ?
ముంబాయి డిటెక్టీవ్ సంస్థ రమేష్ జారికిహోళితో గత ఏడాది నుంచి ఎవరెవరు ఏమి మాట్లాడారు అంటూ అనుమానం ఉన్న సుమారు 6 వేల నుంచి 7 వేల మొబైల్ కాల్ డేటాను సేకరించి వాటిని ఎస్ఐటీ అధికారులకు అప్పగించారని తెలిసింది. ముంబాయి డిటెక్టీవ్ సంస్థ ఇచ్చిన కాల్ డేటా ఆధారంగా ఎస్ఐటీ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారని సమాచారం,

పీజీ సుందరి అండ్ కో
కేసు విచారణ చేస్తున్న ఎస్ఐటీ అధికారులు మంత్రితో రాసలీలలు సాగించిందని ఆరోపిస్తూ బెంగళూరు పీజీ సుందరితో పాటు మొత్తం ఐదు మందిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఇంకా కొందరిని అదుపులోకి తీసుకోవాలని ఎస్ఐటీ అధికారులు నిర్ణయించారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న పీజీ సుందరి, ఆమె గ్యాంగ్ లోకి వారి మీద ఎస్ఐటీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు.

ఒక్కటైన జారికిహోళి బ్రదర్స్
కర్ణాటక రాజకీయాల్లో జారహోళి బ్రదర్స్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జారకిహోళి ఫ్యామిలీలో ఎవరో ఒకరు మంత్రిగా ఉండటం ఇంతకాలం జరిగింది, ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టిన జారకిహోళి బ్రదర్స్ రమేష్ జారకిహోళికి సంపూర్ణ మద్దతు ఇచ్చి జారకిహోళి ఫ్యామిలీ పరువు కాపడటానికి సిద్దం అయ్యారు. జారకిహోళి బ్రదర్స్ ఒక్కటి అయిపోవడంతో రమేష్ జారకిహోళి రాసలీలల కేసు వ్యవహారం రసవత్తరంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications