ఐఐటి విద్యార్థినిపై ప్రోఫెసర్ లైంగిక వేధింపులు, అలాంటిదేమీ లేదన్న వీసీ

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ భువనేశ్వర్‌లోని ఐఐటి ఫ్రోఫెసర్‌పై విద్యార్థిని ఆరోపించింది. బాధిత విద్యార్థిని తరపు న్యాయవాది ఈమేరకు ప్రోఫెసర్‌కు నోటీసులు పంపారు.

భువనేశ్వర్ ఐఐటిలోని విఆర్ పేడిరెడ్డి వద్ద పశ్చిమబంగాకు చెందిన ఓ విద్యార్థిని 2011లో పిహెచ్‌డిని ప్రారంభించింది. 2012లో ప్రోపెసర్ ఆమెను లైంగికంగా వేధించినట్టు బాధిత విద్యార్థిని ఆరోపిస్తోంది.

PhD student accuses IIT Bhubaneswar professor of sexually harassing her

ఫిర్యాదు చేస్తే చదువుపై ప్రభావం పడుతోందని భావించి రెండేళ్ళు సహనంతో ఉన్నట్టు బాధితురాలు న్యాయవాది తెలిపారు. ఇక భరించలేక 2016 అక్టోబర్ 6న, ఇంటర్నేషనల్ కంప్లైంట్ కమిటీకి ఫ్రోఫెసర్‌పై ఫిర్యాదు చేసినట్టు ఆయన చెబుతున్నారు.

ఈ కమిటీ ఆచార్యుడిని నిర్ధోషిగా గుర్తించింది. దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ బాధిత విద్యార్థిని మోడీకి, జాతీయ మహిళ కమిషన్‌కు బెంగాల్, ఓడిశా ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు న్యాయస్థానాన్ని కూడ ఆశ్రయించింది.

అయితే ఈ అద్యాపకుడిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు నోటీసులు ఇచ్చిందని న్యాయవాది ప్రహరాజ్ తెలిపారు. అయితే ఈ నోటీసుపై కోర్టు స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారాయన. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని వైస్‌ఛాన్సిలర్ దేవరాజ్‌రత్ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman PhD student at IIT Bhubaneswar has accused a professor of sexually and mentally harassing her and mentally torturing her husband, a PhD student at the same institute.
Please Wait while comments are loading...