కాదన్నదని పెళ్లి కూతుర్ని చంపిన ఘటన, ఈమే(ఫోటో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నాలుగు రోజుల క్రితం (గురువారం) దారుణం జరిగిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఓ ప్రేమికుడు.. తాను ప్రేమించిన యువతి పెళ్లి పీటల మీద కూర్చొని ఉండగా అందరు చూస్తుండగానే కాల్చి వేసిన ఘటన సంచలనం రేపింది.
తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో సదరు యువకుడు పెళ్లి పీటల మీదనే యువతిని అందరూ చూస్తుండగా కాల్చి చంపాడు. భోపాల్‌లోని లాల్‌ఘటి మ్యారేజీ గార్డెన్‌లో చోటు చేసుకుంది. గురువారం రాత్రి గం.11.15 నిమిషాల ప్రాంతంలో అనురాగ్ అనే వ్యక్తి వచ్చి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

అక్కడ ఉన్నవారు అతన్ని పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. కాల్పుల్లో గాయపడిన యువతి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. యువతి పేరు జయశ్రీ నామ్‌దేవ్. తనను మోసం చేయడం వల్లనే జయశ్రీ నామ్‌దేవ్ అనే ఆ యువతిని చంపినట్లు అనురాగ్ పోలీసులకు చెప్పాడు.
జయశ్రీ నామ్‌దేవ్ వృత్తిరీత్యా వైద్యురాలు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, జయశ్రీ ఎప్పుడు కూడా అనురాగ్‌ను ప్రేమించిట్లు కనిపించలేదని అంటున్నారు. ఆమె ఆ విధమైన సంకేతాలను ఇవ్వలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications