వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మికురాలి డ్రెస్‌లో రోడ్లుఊడ్చిన చందాకొచ్చర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చర్ మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు పలువురు ఉద్యోగులు పాలుపంచుకున్నారు. వీరు ముంబైలోని బ్యాక్ బే రిక్లెమేషన్ బ్రాంచ్ ప్రాంతంలో శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా చందా కొచ్చర్ మాట్లాడారు. భారత్ వృద్ధిలో ఐసీఐసీఐ ఎల్లప్పుడు ఉంటుందని చెప్పారు. తాము అనునిత్యం దేశానికి అండగా ఉంటామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ రోజు తాను, తన సహోద్యోగులు తమ బ్రాంచ్ ప్రాంతాన్ని శుభ్రం చేశామన్నారు. ఇది పరిశుభ్ర భారత్ పట్ల తమ చిత్తశుద్ధి అన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.

చందా కొచ్చర్

చందా కొచ్చర్

ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చర్ మంగళవారం నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్చ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్త ఎత్తుతున్న కొచ్చర్.

చందా కొచ్చర్

చందా కొచ్చర్

ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చర్ మంగళవారం నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్చ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్తను ఒక్క దగ్గరకు చేర్చుతున్న కొచ్చర్.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.

వీఐపీలు

వీఐపీలు

స్వచ్చ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొంటున్నారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సినీ తారలు పాల్గొంటున్నారు.

English summary
Ms Chanda Kochhar, MD & CEO of ICICI Bank, today announced her participation in the ‘Swachh Bharat Abhiyan’. Ms. Kochhar and some other employees of ICICI Bank cleaned the area around the Backbay Reclamation branch of ICICI Bank in Mumbai, marking their participation in the national campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X