ముంబైలో మెమన్ అంత్యక్రియలు పూర్తి: భారీగా ప్రజలు
యాకుబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు పూర్తయయ్యాయి. దక్షణ ముంబైలోని చుర్నీ రోడ్డులో ప్రాంతంలో గల బడా ఖబరస్థాన్‌లో ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.
యాకుబ్ మెమన్ తండ్రి సమాధికి సమీపంలోనే యాకుబ్ మెమన్‌ను పూడ్చారు. ఈరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఉరి తీసిన తర్వాత యాకుబ్ మెమెన్ మరణించినట్లుగా వైద్యులు సరిగ్గా ఉదయం 7.01 గంటలకు ప్రకటించారు.

అనంతరం యాకుబ్ మెమన్ మృతదేహానికి జైల్లోనే పోస్టుమార్టం నిర్వహించి, నాగాపూర్ నుంచి ముంబైకి విమానంలో అతన్ని మృతదేహాన్ని తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి ఓ వ్యాన్‌లో మాహిమ్ దర్గాకి తీసుకెళ్లి ప్రార్థనలు జరిపారు.
ఆ తర్వాత మాహిమ్ ప్రాంతంలో ఉన్న అతని సోదరుడు సులేమాన్ మెమన్ ఇంటికి తీసుకెళ్లారు. సులేమాన్ ఇంటి వద్ద, ఖబరస్థాన్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజల వచ్చారు. ఈ సమయంలో మెమన్ పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకుని అతడి కోసం ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులు ముస్లిం సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే ఎలాంటి నినాదాలు చేయొద్దని వారికి పోలీసులు సూచించారు. యాకుబ్ మెమన్ నివాసం వద్ద భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మొహరించారు. మెమన్ మృతదేహాన్ని ఎటువంటి వీడియోలు, ఫోటోలు తీయకూడదని ముందుగానే పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications