ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్ లో పైలట్ల పాత్రపై ట్విస్టులు..! హైకోర్టులో కీలక పిటిషన్ ..!
గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిన ఘటనలో 275 మంది వరకూ చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తాజాగా ప్రాధమిక నివేదిక ఇచ్చింది. ఇందులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పైలట్ల సమన్వయ లోపాలు బయటపడ్డాయి. అలాగే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కాక్ పిట్ రికార్డర్ల అధ్యయన ఫలితాల ఆధారంగా ఓ కథనం ప్రచురించింది.
ఈ రెండు రిపోర్టుల్లోనూ విమానంలో ఎలాంటి లోపాలు లేవని దాదాపుగా తేలిపోయింది. దీంతో పైలట్ల మధ్య సమన్యయ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అన్న చర్చ సాగుతోంది. దీంతో భారత పైలట్ల సంఘంతో పాటు అంతర్జాతీయ పైలట్ల అసోసియేషన్ సైతం ఈ రిపోర్టుల్ని తోసిపుచ్చుతున్నాయి. ఇంకేదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశాయి. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఈ రిపోర్టుల ఆధారంగా అప్పుడే ఓ అంచనాకు రావొద్దని సూచించారు.

ఈ నేపథ్యంలో పైలట్ల పాత్రపై మీడియా కథనాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇందులో పిటిషనర్ అయిన కోయంబత్తూరుకు చెందిన లాయర్ ప్రవీణ్.. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, విమాన ప్రమాదాల మీడియా కవరేజీని నియంత్రించడానికి మార్గదర్శకాలు, సలహాలు జారీ చేయాలని ఆదేశించాలని కోర్టును కోరారు.
మరణానంతరం వ్యాప్తి చేయబడిన నిరాధారమైన ఆరోపణలు మరియు ఊహాజనిత కథనాలు మరణించిన వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తాయని పిటిషన్లో ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే దుఃఖిస్తున్న కుటుంబాలకు భావోద్వేగ గాయాన్ని కలిగిస్తాయన్నారు. అధికారికంగా దర్యాప్తు పూర్తికాకుండా మధ్యలోనే పైలట్లను నిందించే చర్యల్ని అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు. ఇటువంటి ధృవీకరించని నివేదికలు పైలట్ల వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీస్తాయని, విమానయాన భద్రతపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, అధికారిక దర్యాప్తు ప్రక్రియల సమగ్రతను దెబ్బతీస్తుందని తెలిపారు.

ఈ నెల 14న తాను ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు విజ్ఞాపన పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. మీడియా కథనాల తీరు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(ఏ), ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కూడా తెలిపారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications