Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే ?
బెంగళూరు: ఆ ప్రాంతంలో అమాయకులను బెదిరించి దౌర్జన్యాలు చేసిన యువకుడు ఏకంగా రౌడీషీటర్ జాబితాలో చేరిపోయాడు. రౌడీషీటర్ గా ఆ ప్రాంతంలో అక్రమాలకు పాల్పడ్డాడు. మత్తుమందు, గంజాయి విక్రయించడం మొదలుపెట్టి భారీగా డబ్బులు సంపాధించాడు. ఇతర రాష్ట్రాలకు వెలుతున్న నిందితుడు గంజాయి తీసుకు వచ్చి ఏజెంట్లను పెట్టకుని ఐటీ హబ్ లో యువతను మత్తుకు బానిసలు చేస్తున్నాడు. ఇంత చేస్తున్న రౌడీషీటర్ పోలీసులకు భయపడుతున్నాడు. అయితే రౌడీషీటర్ అతని అత్త కొంపను ముంచేయడం హాట్ టాపిక్ అయ్యింది.

ఐటీ హబ్ లో రౌడీషీటర్
బెంగళూరు నగరంలోని జగజ్జీవన్ రామ్ నగర్ లో సయయద్ అస్గర్ అలియాస్ సయ్యద్ (35) అనే రౌడీషీటర్ షీటర్ నివాసం ఉంటున్నాడు. చిన్నచిన్నగా దౌర్జనాలు. గొడవలు చేస్తున్న సయ్య ఆ ప్రాంతంలోని అమాయకులను బెదిరంచి డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టారు. సయ్యద్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అయ్యాయి. జేజే నగర్ పోలీసులు నిందితుడు సయ్యద్ మీద రౌడీషీటర్ ఓపెన్ చేశారు. తరువాత సయ్యద్ అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

గంజాయి డీల్
సయ్యద్ రౌడీషీటర్ గా ఆ ప్రాంతంలో అక్రమాలకు పాల్పడ్డాడు. మత్తుమందు, గంజాయి విక్రయించడం మొదలుపెట్టి భారీగా డబ్బులు సంపాధించాడు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హోల్ సేల్ లో గంజాయి విక్రయాలకు డీల్ మాట్లాడుకున్నాడు. ఎక్కువగా ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా బెంగళూరు తీసుకు వస్తున్న సయ్యద్ గంజాయి వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టాడు.

ఏజెంట్లను పెట్టుకుని
రౌడీషీటర్ సయ్యద్ పోలీసులకు భయపడి ఎక్కువగా గంజాయి విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బెంగళూరులో గంజాయి అమ్మడానికి కొందరు ఏజెంట్లను పెట్టకున్న సయ్యద్ ఐటీ హబ్ లో అనేక ప్రాంతాల్లో విక్రయించి యువతను మత్తుకు బానిసలు చేస్తున్నాడు. రౌడీషీటర్ సయ్యద్ మీద కొంతకాలంగా జేజే నగర్ పోలీసులు నిఘా వేశారు. సయ్యద్ గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది.

అత్త కొంప ముంచేసిన సయ్యద్
సయ్యద్ ను అరెస్టు చేసి అతని ఇంటిలో సోదాలు చెయ్యగా రెండు కేజీల గంజాయి మాత్రమే చిక్కింది. రౌడీషీటర్ సయ్యద్ ను పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి బెండ్ తీశారు. ఆ సందర్బంలో తన అత్త ఇంటిలో గంజాయి ఉందని సయ్యద్ పోలీసులకు చెప్పాడు. గుర్రప్పనపాళ్యలోని సయ్యద్ అత్త ఇంటిలో సోదాలు చేస్తే 22 కేజీల గంజాయి చిక్కిందని పోలీసులు అన్నారు. తనకు ఏమీ తెలీదని, తన అల్లుడు ఏదో లగేజ్ తెచ్చి పెడుతున్నాడు అని అనుకున్నానని, ఇది గంజాయి అని తనకు తెలీదని సయ్యద్ అత్త చెబుతోందని జేజే నగర్ పోలీసులు అంటున్నారు.

మండిపడిన రౌడీషీటర్ భార్య
పోలీసులకు చిక్కకూడదని ఒడిశా నుంచి తీసుకువస్తున్న గంజాయిని అత్త ఇంటిలో దాచిపెడుతున్న సయ్యద్ కొంచెం కొంచెం గంజాయి బయటకు తీసుకు వచ్చి విక్రయిస్తున్నాడని పోలీసు అధికారులు అన్నారు. తన ఇంటిలో ఉన్నది గంజాయి అని సయ్యద్ అత్తకు తెలుసా ?, తెలీదా ? అని ఆరా తీస్తున్నామని జేజే నగర పోలీసులు అన్నారు. పోలీసుల భయంతో రౌడీషీటర్ సయ్యద్ అతని అత్తను అడ్డంగా బుక్ చెయ్యడంతో అతని భార్య మండిపడుతోందని తెలిసింది. రౌడీషీటర్ సయ్యద్ ను అరెస్టు చేసిన జేజే నగర్ పోలీసులు అతన్ని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించి విచారణ చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications