Plane Crash: కూలి బూడిదైన యుద్ధ విమానం.. పైలట్లు సురక్షితం
Plane Crash: మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో బహ్రెటాసాని గ్రామం సమీపంలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదానికి ముందే ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన పైలట్లను తీసుకెళ్లేందుకు వైమానిక దళ హెలికాప్టర్ ప్రమాద స్థలికి చేరుకుంది. ఆ తర్వాత వారిద్దరిని గ్వాలియర్ కు తీసుకెళ్లారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ప్రమాదంలో వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 శిక్షణ విమానం కూలిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం తర్వాత బయటకు వచ్చిన చిత్రాలలో.. పైలట్ తన సహోద్యుగులకు ఫోన్ ద్వారా ప్రమాదం గురించి తెలియజేస్తున్నట్లు కనిపించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపింది. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
ప్రమాదంలో గాయపడిన పైలట్
రక్షణ అధికారుల ప్రకారం.. రెండు సీట్లు ఉండే మిరాజ్ 2000 సాధారణ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతుందన్నారు. మిరాజ్-2000 యుద్ధ విమానం వివిధ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఆ విమానం ఒక పొలంలో కూలిపోగా.. ఆ తర్వాత మంటలు చెలరేగి బూడిదైంది. ఈ సంఘటన తర్వాత పెద్ద సంఖ్యలో గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు పైలట్లను అక్కడి నుండి తీసుకెళ్లి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. దీని గురించి కరైరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి వినోద్ చావై మాట్లాడుతూ.. విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి ముందు ఇద్దరు పైలట్లు తమంతట తాముగా ఎజెక్ట్ అయ్యారని చెప్పారు. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని వినోద్ చావై వెల్లడించారు.












Click it and Unblock the Notifications