ప్లాస్మా థెరపీ .. కరోనా తీవ్రతను, మరణాలను తగ్గించటంలో ప్రయోజనకారి కాదు : ఐసీఎంఆర్ స్టడీ

కరోనావైరస్-సోకిన రోగులకు ప్లాస్మా థెరపీని ఉపయోగించడం వలన తీవ్రమైన కరోనా ప్రభావాన్ని తగ్గించటం , లేదా మరణాలను తగ్గించడం సాధ్యం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలింది . 'ప్లాసిడ్' ట్రయల్.. ప్లాస్మా పనితీరును పరిశీలించటానికి భారతదేశంలోని 39 ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులను ఎంపిక చేసి నిర్వహించారు . ఏప్రిల్ 22 నుండి జూలై 14 మధ్య కరోనా చికిత్స కోసం ప్లాస్మా వినియోగం, దాని ప్రభావం పరిశోధించడానికి నిర్వహించబడింది.అయితే పాస్మా విధానం అంత సహాయకారి కాదని అధ్యయనం తేల్చింది .

కరోనా నుండి కోలుకున్న వ్యక్తి యొక్క రక్తం నుండి యాంటీ బాడీస్ తీసుకుని, తీవ్రంగా కరోనావైరస్ సోకినా రోగికి ఆ ప్రతిరోధకాలను బదిలీ చేయడం చేసి దాని ప్రభావాన్ని పరిశీలించారు. కన్వాల్సెంట్ ప్లాస్మా (సిపి) చికిత్సలో భాగంగా నిర్వహించిన ప్లాస్మా థెరపీతో పెద్దగా ప్రయోజనం లేదని గుర్తించారు .ఈ అధ్యయనంలో మొత్తం 464 మంది పాల్గొన్నారు . మహమ్మారికి స్పందించడానికి ఐసిఎంఆర్ ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కోవిడ్ -19 ఈ అధ్యయనాన్ని సమీక్షించి ఆమోదించింది.

Plasma therapy is not beneficial in reducing corona severity and mortality: ICMR study

జూన్ 27 న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కరోనా వైరస్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్ "పరిశోధనాత్మక చికిత్సలు" కింద కరోనావైరస్-సోకిన రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీని ఉపయోగించడానికి అనుమతించింది. ఈ విధానం పెద్దగా ప్రయోజనాత్మకంగా లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో దాతలకు పిలుపు, మరియు భారతదేశంలో అధిక ధర ట్యాగ్లతో బ్లాక్ మార్కెట్లో సిపి అమ్మకం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనం తెలిపింది.

చాలావరకు ప్లాస్మా థెరపీ చేసినా మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ప్లాస్మా థెరపీతో ప్రయోజనం పెద్దగా లేదని గతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ కూడా తన అధ్యయనంలో తేల్చి చెప్పింది . అధ్యయనంలో భాగంగా 464 మంది కరోనా కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ప్లాస్మా థెరపీని ప్రయోగించారు. అయితే ఫలితాలు ఆశించిన మేరకు లేవని అధ్యయనం తేల్చింది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+