సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బాటిల్ విసిరిన దుండగుడు(వీడియో)

గాంధీనగర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. రాజ్‌కోట్‌లోని గర్బా వేదికపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి.. ఓ వాటర్ బాటిల్ విసిరారు. ఇందకు సంబంధిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శనివారం రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్ర ప్రజల వైపు చేతులు ఊపుతూ ముందుకు నడుస్తున్నారు. ఆ సమయంలోనే ఖోడల్ధామ్ ఆలయ గర్బా వేదిక వద్ద ఓ వాటర్ బాటిల్ ఆయన వైపుగా వచ్చి పడింది. అయితే, ఆ బాటిల్ ఆయనకు తగలలేదు. కొద్ది దూరంలోనే పడింది.

Plastic water bottle hurled at Arvind Kejriwal at Rajkot garba venue

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజుల గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన గుజరాత్ పర్యటనకు తరచుగా వెళ్తున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ డిసెంబర్‌లో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తామని, కచ్ జిల్లాలోని ప్రతి మూలకు నర్మదా నీటిని అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ సభలు, ర్యాలీలలో చెబుతున్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించడానికి గుజరాత్‌లోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రిని నిర్మిస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+