Railway : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఇక ఆ భారం తప్పింది...
దక్షిణ మధ్య రైల్వే విభాగం రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలను రూ.10కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్,హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.20గా ఉంటుందని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు ఇదివరకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. ఎట్టకేలకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ అన్ని రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఎత్తేసిన కొత్తలో స్పెషల్ రైళ్లను మాత్రమే నడిపిన రైల్వే శాఖ... క్రమంగా రెగ్యులర్ రైళ్లను పట్టాలెక్కించింది. ఈ నెల 19 నుంచి దాదాపు 82 రైళ్లను పున:ప్రారంభించింది. వీటిలో 16 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ రైళ్లకు స్టేషన్లలోనే టికెట్లు ఇస్తారని రైల్వే శాఖ ఆ సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులు భౌతిక దూరం పాటించడం,మాస్కు ధరించడం వంటివి తప్పనిసరి.

ఇక ఇటీవలే ప్రైవేట్ రైళ్లకు రైల్వే శాఖ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లకు బిడ్లు ఆహ్వానించారు.కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని పార్లమెంటులో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ రైళ్లపై ప్రైవేట్ రైళ్ల ప్రభావం ఉండబోదన్నారు.రైల్వే శాఖకు చెందిన ట్రాక్,సిగ్నల్స్,ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌నే ప్రైవేట్ రైళ్లు వాడుకుంటాయని తెలిపారు. ఈ రైళ్ల నిర్వహణకు అవసరమయ్యే లోకో పైలట్లు,గార్డులను రైల్వే శాఖనే అందించనుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications