బాబ్బాబు.. గోవా రావొద్దు, వస్తే 14 రోజులు హోటళ్లలోనే బందీ, సీఎం సావంత్..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. వైరస్ ప్రభావ స్థాయిని బట్టి... దేశంలో జోన్లను విభజించిన సంగతి తెలిసిందే. అయితే గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాత్రం తమ రాష్ట్రానికి రావొద్దని కోరుతున్నారు. గోవా అంటే హాలీడే స్పాట్.. బీచ్‌తో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే పర్యాటకుల వల్ల వైరస్ ప్రబలే అవకావం ఉన్నందున.. గోవా రావొద్దు.. బాబోయ్ అని సావంత్ కోరుతున్నారు.

హోం క్వారంటైన్ కంపల్సరీ
విమానాలు, ప్రత్యేక రైళ్లలో వస్తోన్న గోవాకు చెందిన వారు కాకుంటే క్వారంటైన్ తప్పనిసరి అని సావంత్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తోన్న రైలు గోవాలోని మడగావ్ వద్ద శనివారం ఆగనుంది. అయితే ఆ రైలును స్టేషన్ వద్ద నిలుపొద్దని సావంత్ చెబుతున్నారు. అందులో ప్రయాణిస్తున్న 720 మంది.. మడగావ్‌కి చెందినవారు కాదని గుర్తించినట్టు తెలిపారు.

అనర్థమే..?
ఒకవేళ ప్రయాణికులు దిగితే జరిగే అనర్థం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి తాము తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తామని.. హోం క్వారంటైన్‌లో ఉండాలని చెబుతామని పేర్కొన్నారు. అయితే వారు తమ మాట వింటారో లేదోననే ఆందోళన నెలకొంది. అందుకే రైలును నిలిపొద్దు అని కోరామని చెప్పారు. మడగావ్‌లో రైలు ఆపొద్దని విషయంపై తమకు సమాచారం లేదు అని రైల్వే అధికారులు తెలిపారు.

నెలన్నర నుంచి నో కేసు
గోవాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గింది. నెలన్నర నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ గురువారం 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారు గోవాకు చెందిన వారు కాదని, బయట రాష్ట్రాల నుంచి వచ్చారని అధికారులు చెప్పడంతో... సీఎం ప్రమోద్ సావంత్ మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ శుక్రవారం నుంచి గోవాకు వచ్చేవారు తమ వసతిని తామే సమకూర్చుకోవాలన్నారు.
Recommended Video

14 రోజులు హోటళ్లలోనే..
కాదు కూడదని వస్తే.. 14 రోజులపాటు హొటళ్లలో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. బీచ్‌లోకి వెళ్లేందుకు వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోము అని స్పష్టంచేశారు. బీచ్‌లు మూసివేయబడి ఉంటాయని.. వారు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి రాలేదని చెప్పారు. విమానాల ద్వారా వచ్చేవారిని కూడా ఎయిర్ పోర్టులలో చెక్ చేస్తామని స్పష్టంచేశారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications