పీఎం గతిశక్తి ప్లాన్: దేశంలో నేషనల్ హైవేస్ నెట్‌వర్క్ 25,000 కి.మీ.ల మేర విస్తరణ!!
2022 బడ్జెట్‌ను సమర్పిస్తూ, ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ కింద, ప్రభుత్వం 2022-23లో జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను 25,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నేషనల్ హైవేస్ నెట్వర్క్ కోసం 20 వేల కోట్ల రూపాయలను సమీకరిస్తోంది అని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఇక పర్వత ప్రాంతాలు అన్నీ కలిసేలా పిపిపి మోడల్ లో పర్వత్ మాల కార్యక్రమాన్ని చేపడుతున్నామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్‌ప్లాన్‌ను 2022-23లో ఖరారు చేస్తామన్న నిర్మలా సీతారామన్
రోడ్డు రవాణా కోసం ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్‌ప్లాన్‌ను 2022-23లో ఖరారు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. జనవరి 31న జరిగిన ఆర్థిక సర్వే మౌలిక సదుపాయాల పరిధి మరియు నాణ్యత ఒక దేశం దాని తులనాత్మక ప్రయోజనాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మరియు వ్యయ పోటీతత్వాన్ని మొదలు పెట్టేలా చేస్తుందని పేర్కొంది. 2013-14 నుండి జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో స్థిరమైన పెరుగుదలను సర్వే వెల్లడిస్తుంది. 2019-20లో 10,237 కిలోమీటర్లతో పోలిస్తే 2020-21లో 13,327 కిలోమీటర్లు నిర్మించబడిందని సర్వే తెలిపింది.

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో నేషనల్ హైవేస్ పై కీలక అంశాలు
ఏ ఆర్థిక వ్యవస్థకైనా మౌలిక సదుపాయాలు వెన్నెముక అని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే పేర్కొంది. 2021-22లో (సెప్టెంబర్ వరకు) 3,824 కి.మీ రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మించినట్లు తెలిపింది. 2013-14 నుండి జాతీయ రహదారుల నిర్మాణంలో స్థిరమైన పెరుగుదల ఉంది. 2019-20లో 10,237 కి.మీలతో పోలిస్తే 2020-21లో 13,327 కి.మీల రోడ్లు నిర్మించడం గత సంవత్సరంతో పోలిస్తే 30.2 శాతం పెరుగుదలను సూచిస్తుంది. సర్వే ప్రకారం, 2020-21లో రోడ్డు నిర్మాణంలో గణనీయమైన పురోగమనం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే వ్యయం 29.5 శాతం పెరిగింది.

రోడ్డు రవాణా అనేది సామాజిక-ఆర్థిక ఏకీకరణ యొక్క శక్తివంతమైన సాధనం
ఇక ఈ ఈ నెట్‌వర్క్ 2024-25 నాటికి 2 లక్షల కిమీలకు విస్తరిస్తారు. తీర ప్రాంతాల వెంట దాదాపు 6000 కిలోమీటర్ల మేర నాలుగు లేదా ఆరు లేన్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి, ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధానిని నాలుగు లేన్ల హైవేలతో అనుసంధానించడానికి ప్రతిపాదన ఉంది.మహమ్మారి సంవత్సరంలో ఉపాధిని సృష్టించే మరియు మౌలిక సదుపాయాలకు మద్దతు ఇచ్చే కీలకమైన రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. రోడ్డు రవాణా అనేది సామాజిక-ఆర్థిక ఏకీకరణ యొక్క శక్తివంతమైన సాధనంగా విస్తృతంగా గుర్తించబడిందని మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైనదని సర్వే పేర్కొంది.

పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్.. జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్
వాస్తవానికి, పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్. దీని ప్రకారం ప్రతి రంగంలో అభివృద్ధి పనులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మాస్టర్ ప్లాన్‌లో, భారతదేశ స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వాల్సి ఉంటుంది 'లోకల్ ఫర్ వోకల్' అంటూ భారతదేశంలోని వ్యాపారవేత్తలు ప్రపంచంలోని కంపెనీలతో పోటీ పడగలరు. ఈ మాస్టర్ ప్లాన్ దేశ సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకాన్ని సిద్ధం చేస్తుంది. పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ ప్రతి రంగంలో అభివృద్ధి పనులకు కొత్త రూపును, ఊపును ఇస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది.












Click it and Unblock the Notifications