వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్: 2024లో మోదీ VS కేజ్రీవాల్?, అప్పుడే పోస్టర్లు, ఏం జరుగుతుందో ?!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#DelhiElectionResults: AAP Crosses Majority Mark In Early Trends

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచాలనకు అనుగుణంగా అమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఢీకొని ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అప్పుడే ఢిల్లీలో పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఉందని ఆప్ కార్యకర్తలు అప్పుడే పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందో ? చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఆపని మాత్రం చెయ్యోద్దు ఫ్లీజ్, సీఎం కేజ్రీవాల్ మనవి, సంబరాలు, హామీ ఇచ్చాం!ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఆపని మాత్రం చెయ్యోద్దు ఫ్లీజ్, సీఎం కేజ్రీవాల్ మనవి, సంబరాలు, హామీ ఇచ్చాం!

ఢిల్లీలో ఆప్ పోస్టర్స్ కలకలం

ఢిల్లీలో ఆప్ పోస్టర్స్ కలకలం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం ప్రారంభం అయిన తరువాత ఢిల్లీలోని అమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మంగళవారం ఆప్ కార్యకర్తలు అసలు కథ 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో మొదలౌతుందని ఓ పోస్టర్స్ చేత పట్టుకున్నారు.

నరేంద్ర మోదీ VS అరవింద్ కేజ్రీవాల్

నరేంద్ర మోదీ VS అరవింద్ కేజ్రీవాల్

2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాన పోటీ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఉంటుందని ఆప్ కార్యకర్తలు పోస్టర్స్ చేత పట్టుకున్నారు. ఆ రోజు అసలు కథలో హీరో ఎవరో తేలిపోతుందని ఆప్ కార్యకర్తలు అంటున్నారు.

 రియల్ హీరో క్రేజీవాల్!

రియల్ హీరో క్రేజీవాల్!

ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించాలని అమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేశాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కు అన్నీ తానై ముందుండి నడిపించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

లోకల్ VS జాతీయ సమ్యలు

లోకల్ VS జాతీయ సమ్యలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా స్థానిక సమస్యలు, జాతీయ సమస్యల విషయంపైనే ఎక్కువగా అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీని మరోసారి కైవసం చేసుకోవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి పోటీ ఇస్తూ ప్రచారం చేశారు.

 2015లో పోటాపోటీగా ప్రచారం

2015లో పోటాపోటీగా ప్రచారం

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటాపోటీగా ప్రచారం చేశారు. తరువాత ఢిల్లీలో 54 శాతం ఓట్లు సాధించిన అమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో అధికారంలోకి రావడానికి అరవింద్ కేజ్రీవాల్ సిద్దం అయ్యారు. ఇదే సమయంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆప్ కార్యకర్తలు పోస్టర్లు ప్రదర్శించడంతో బీజేపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు.

English summary
As the counting of votes polled in the high-stakes Delhi Assembly election started on Tuesday morning, a poster on 'Arvind Kejriwal versus Narendra Modi' contest in the 2024 General Elections was spotted at the AAP office in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X