మోదీ నామినేషన్‌: ఆయన వెంట ఆ నలుగురు

PM Modi nomination: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ వేశారు. తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నుంచి ముచ్చటగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. కొద్దిసేపటి కిందటే రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ స్థానానికి చివరి విడతలో అంటే జూన్ 1వ తేదీన పోలింగ్ జరుగనుంది.

ఈ ఉదయం ఆయన దశాశ్వమేధ ఘాట్‌లో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీమ తల్లికి కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల తరువాత రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని, నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

PM Modi 3rd time files his nomination from Varanasi as BJP s candidate

ఆ సమయంలో మోదీ వెంట బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి, వెనుకబడిన కులాలకు చెందిన నాయకుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాలంటీర్ బైజ్‌నాథ్ పటేల్, ఓబీసీ సామాజిక వర్గానికే చెందిన లాల్‌చంద్ కుష్వాహా, దళిత నాయకుడు సంజయ్ సోంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.

వారణాశి నుంచి మోదీ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగడం వరుసగా ఇది మూడోసారి. 2014, 2019 నాటి ఎన్నికల్లో వారణాశి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, 2019లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్‌ను ఓడించారు.

ఈ సారి కూడా గెలుపు లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా తరఫున కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ పోటీ పడుతున్నారు. 2004 మినహా.. 1996 నుంచీ బీజేపీ అభ్యర్థే గెలుస్తూ వస్తోన్నారిక్కడ. బీజేపీ నుంచి శంకర్ ప్రసాద్ జైస్వాల్, మురళీ మనోహర్ జోషి గతంలో విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+