అప్రమత్తంగా ఉండండి - ప్రధాని హెచ్చరిక..!!

జార్ఖండ్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. రెండు కూటముల ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకోవటానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలతో ఆకర్షణీయ హామీలను గుప్పించారు. ముఖ్య నేతలు ప్రచార బరిలోకి దిగారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ - జేఎంఎం కూటమి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓబీసీలను విడదీసి రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని అప్రమత్తం చేసారు.

జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ - జేఎంఎం కూటమిని ప్రధాని టార్గెట్ చేసారు. ఈ కూటమి ఓబీసీలను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరించారు. అధికారం కోసం ఆ కూటమి నేతలుె దేనికైనా దిగజారుతారని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్‌ వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఐక్యత లేని వరకు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉందని వివరించారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ప్రధాని విమర్శలు చేసారు.

PM Modi alleges Congress and its allies want to divide the OBC community by pitting sub-castes against each other

జమ్ముకశ్మీర్ లో ​ అధికరణ 370ని తిరిగి తీసుకురావాలని కోరటం ద్వారా సైనికులు మళ్లీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. మొదటిసారి భారత రాజ్యాంగంపై జమ్ముకశ్మీర్​ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారని వెల్లడించారు. అదే తాను అంబేడ్కర్​ ఇచ్చే నివాళిగా పేర్కొన్నారు. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు ఝార్ఖండ్​ లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం అవసరమని చెప్పారు. తమ కూటమి గెలిస్తే జేఎమ్ఎమ్​ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సృష్టించిన రిక్రూట్‌మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+