జిన్నా వ్యతిరేకిస్తే.. నెహ్రూ వంతపాడారు..! వందేమాతరంపై మోడీ..!
భారత జాతీయగీతం వందేమాతరం అమల్లోకి వచ్చి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్ సభలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. ఈ చర్చను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతి పిత మొహమ్మద్ అలీ జిన్నా అప్పట్లో వందే మాతరాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రధానులైన నెహ్రూ, ఇందిరలు దాన్ని అంగీకరించారని మోడీ ఆరోపించారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని, ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరాన్ని వ్యతిరేకించడంలో మొహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని మోడీ ఆరోపించారు. ఎందుకంటే అది "ముస్లింలను చికాకుపెడుతుందన్నారు.
వందేమాతరం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పుడు, దేశం అత్యవసర పరిస్థితిలో చిక్కుకుందన్నారు. అది 100వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పుడు, రాజ్యాంగం గొంతు కోశారన్నారు.

ఇప్పుడు, 150వ వార్షికోత్సవ వేళ 1947లో మనకు స్వేచ్ఛను తెచ్చిపెట్టిన 'వందేమాతరం' వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇది మంచి అవకాశమని ప్రధాని మోడీ తెలిపారు. 1875 నవంబర్‌లో బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన పాటను ప్రశంసిస్తూ అది వేగంగా
స్వాతంత్ర్య సమరయోధులకు నినాదంగా మారిందన్నారు. 1937 సమావేశంలో "మతపరమైన ఎజెండాకు తూట్లు పొడిచి" దేశ జాతీయ గీతాన్నికుదించడం ద్వారా కాంగ్రెస్ దాన్ని అగౌరవ పరిచిందన్నారు.
మనం తాజాగా 75వ రాజ్యాంగ వార్షికోత్సవం జరుపుకున్నామని, అలాగే సర్దార్ వల్లభ పటేల్ ,బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామని ప్రధాని మోడీ గుర్తుచేశారు. వీటితో పాటు గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నామన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మనం వందేమాతరం 150 సంవత్సరాలు జరుపుకుంటున్నామని ప్రధాని మోడీ తెలిపారు.












Click it and Unblock the Notifications