ఓఖీ తుపాను ప్రభావం: గుజరాత్‌లో బీజేపీ ప్రచారం నిలిపివేత
అహ్మదాబాద్: ఓఖి తుఫాను కారణంగా గుజరాత్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ సాయంత్రం ఓఖీ తుఫాను గుజరాత్‌లోకి ప్రవేశించే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ప్రచారాన్ని ప్రస్తుతానికి ఆపాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ప్రచారం నిలిపివేసి తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ కార్యకర్తలకు సూచించారు.
Recommended Video

Cyclone Okchi Updates : Video

గుజరాత్‌లో మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 9వ తేదీన జరగనున్నాయి. బీజేపీ ప్రచార షెడ్యూల్ ప్రకారం మంగళవారం అమిత్ షా, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ, పార్టీ అధికార ప్రతినిధఇ సంబిత్ పాత్రా తదితరులు ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది.












Click it and Unblock the Notifications