ప్రధాని మోదీ కనుసన్నల్లో.. రోహిత్ శర్మ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటను ఈ రెండు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, ఆంథొని అల్బనీస్ వీక్షించనున్నారు.

అహ్మదాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోంది. టీమిండియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ తలపడుతోంది. నాలుగు టెస్టుల్లో మూడు మ్యాచ్ లు ముగిశాయి. 2-1 ఆధిక్యతతో నిలిచింది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా. నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆరంభం కానుంది. అహ్మదాబాద్ మొతెరాలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది.

 టెస్టుల్లో..

టెస్టుల్లో..

తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లల్లో ఘన విజయాన్ని సాధించింది టీమిండియా. నాగ్‌ పూర్ లో జరిగిన టెస్ట్ లో ఆస్ట్రేలియన్లను ఇన్నింగ్, 132 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా సాగిన రెండో టెస్ట్ లోనూ భారత జట్టుకు ఎదురులేకుండా పోయింది. ఈ మ్యాచ్ ను కూడా ఆరు వికెట్ల తేడాతో తన ఖాతాలో వేసుకోగలిగింది. మూడో టెస్ట్ లో మాత్రం బోల్తా కొట్టింది. తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేశారు కంగారూలు.

మూడో టెస్ట్ పై..

మూడో టెస్ట్ పై..

ఈ మూడు టెస్ట్ మ్యాచ్ లు కూడా మూడే రోజుల్లో క్లోజ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ మరీ ఘోరం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం ఈ మ్యాచ్ పై పెదవి విరిచింది. ఈ మ్యాచ్ ను నిర్వహించిన ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం పిచ్.. అధ్వాన్నమైనదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. టెస్ట్ మ్యాచ్ ను ఆతిథ్యాన్ని ఇచ్చేంతటి పిచ్ కాదని, ఆ స్థాయి ప్రమాణాలు దీనికి లేవనీ స్పష్టం చేసింది.

9 నుంచి నాలుగో టెస్ట్..

9 నుంచి నాలుగో టెస్ట్..

కాగా- ఈ సిరీస్ లో ఇక నాలుగో మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ప్రారంభం కానుంది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇది. భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో డ్రా చేసుకున్నా చాలు. సిరీస్ భారత్ వశమౌతుంది. ఆస్ట్రేలియన్లు గెలిస్తే మాత్రం సిరీస్ సమం అవుతుంది. 2-2 తేడాతో టీమిండియాకు సమవుజ్జీగా నిలుస్తుంది రోహిత్ సేన.

 తిలకించనున్న ప్రధానులు..

తిలకించనున్న ప్రధానులు..

ఈ మ్యాచ్ కు ఓ ప్రత్యేకత ఏర్పడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి రోజు మ్యాచ్ ను స్వయంగా వీక్షించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని అల్బనీస్ తో కలిసి మ్యాచ్ ను తిలకించనున్నారాయన. ఓ టెస్ట్ మ్యాచ్ ను ఈ రెండు దేశాల ప్రధానులు తిలకించడం ఇదే తొలిసారి కావడం.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మోదీ-ఆంథొని సమక్షంలో ఈ రెండు దేశాల ప్లేయర్లు ఎలా ఆడతారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

ఆస్ట్రేలియా క్యాంపస్..

ఆస్ట్రేలియా క్యాంపస్..

మూడు రోజుల పర్యటన కోసం ఆంథొని అల్బనీస్ ఈ నెల 8వ తేదీన భారత్ కు రానున్నారు. 11వ తేదీ వరకు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో భేటీ అవుతారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. వాటిపై సంతకాలు చేస్తారు. భారత్ లో ఆస్ట్రేలియా యూనివర్శిటీ క్యాంపస్ లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+