వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ కీలక ప్రకటన: ఇక ప్రతి డిసెంబర్ 26వ తేదీన..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్, పంజాబ్‌లల్లో ఎన్నికల నగారా మోగింది. ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ మొదలవుతుంది. చివరిదశ మార్చి 7వ తేదీన ముగుస్తుంది. 10న కౌంటింగ్ ఉంటుంది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీ హోదాలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 14వ తేదీన ఒకే విడతలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 59 స్థానాల మేజిక్ ఫిగర్ అవసరం అవుతుంది. 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.

వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తోంది బీజేపీ. అందుకే అందుబాటులో ఉన్న అన్ని వనరులను కూడా వినియోగించుకుంటోందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇందులో భాగమేనా అనిపించేలా- తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రకటన చేశారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి కూడా.

PM Modi announces that 26th December shall be marked as Veer Baal Diwas

ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీని వీర బాలల దినోత్సవంగా జరుకోవాలని మోడీ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కొద్ది సేపటి కిందటే దీనికి సంబంధించిన ప్రకటనను పోస్ట్ చేశారు. సిక్కుల మత గురువు గురు గోవింద్ సింగ్‌ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వీర బాలల దినోత్సవాన్ని జరుపుకోనున్నామని ప్రకటించారు. ఆ రోజున దేశం మొత్తం గురు గోవింద్ సింగ్ కుమారులను స్మరించుకోవాలని సూచించారు.

గురు గోవింద్ సింగ్ కుమారులు జొరావర్ సింగ్, ఫతే సింగ్ వీర మరణం పొందారని గుర్తు చేశారు. ధర్మసంరక్షణ కోసం వారిద్దరూ తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. అన్యాయానికి మాతా గుజ్రి, గురు గోవింద్ సింగ్ తలవంచలేని మోడీ అన్నారు. కోట్లాదిమంది ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించారని చెప్పారు. ప్రపంచం మొత్తం శాంతిమయం కావాలని వారు బలంగా ఆకాంక్షించారని అన్నారు. డిసెంబర్ 26వ తేదీన వారి సేవలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మోడీ చెప్పారు.

English summary
PM Narendra Modi announces that 26th December shall be marked as Veer Baal Diwas, this is a fitting tribute to the courage of the Sahibzades and their quest for justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X