ఎర్రకోటపై మువ్వన్నెల రెపరెపలు- మన పాలన వెయ్యేళ్ల పాటు చరితార్థమౌతుంది: మోదీ
న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై కొద్దిసేపటి కిందటే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, జనాభాలోనూ అగ్రస్థానంలో ఉన్న భారత్.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొంటోందని పేర్కొన్నారు.

మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల పట్ల స్పందించారు. దీనిపై మాట్లాడారు. మణిపూర్‌లో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు. యావత్ దేశం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని.. ఎర్రకోట వేదికగా భరోసా ఇచ్చారు. శాంతి ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తేల్చి చెప్పారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తోన్నాయని వివరించారు.
ఈ సారి ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఊహకందని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు దేశ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలకు మోదీ సానుభూతిని తెలియజేశారు.
LIVE: 77th #IndependenceDay Celebrations | PM @narendramodi's address to the nation. https://t.co/dICK8AbuGJ
— BJP (@BJP4India) August 15, 2023
జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యలు.. వచ్చే 1000 సంవత్సరాల్లో దేశ బంగారు చరిత్రకు అంకురార్పణ చేస్తుందని, చరితార్థం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications