Modi Ka Pariwar: "మోడీ కా పరివార్" ట్యాగ్ పై బీజేపీ నేతలకు ప్రధాని కీలక సూచన..!
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిలోనూ వారి పేర్ల పక్కన మోడీ కా పరివార్ ట్యాగ్ దర్శనమిచ్చింది. మోడీ ఒంటరి అన్న రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలకు కౌంటర్ గా మోడీ కా పరివార్ ట్యాగ్ పెట్టుకోవడం ద్వారా బీజేపీ నేతలు తామంతా మోడీ కుటుంబమే అని చెప్పుకున్నట్లయింది. దీనిపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రధాని మోడీ.. ఇవాళ మాత్రం బీజేపీ నేతలకు కీలక సూచన చేశారు.
తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి 'మోదీ కా పరివార్'ని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ నేతలను అభ్యర్థించారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ప్రధాని మోడీకి కుటుంబం లేదని చేసిన విమర్శల తర్వాత బీజేపీ నేతలు ఇలా సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో తమ పేరుకు మోడీ పరివార్ నినాదం తగిలించారు. దీన్ని తీసేయాలని బీజేపీ నేతలను మోడీ ఇవాళ కోరారు.

ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ లో భారతదేశం అంతటా ప్రజలు ఎన్నికల ప్రచారం ద్వారా తన పట్ల ఉన్న అభిమానానికి గుర్తుగా తమ సోషల్ మీడియాలో 'మోదీ కా పరివార్'ని చేర్చుకున్నారని, భారత ప్రజలు ఎన్డీయేకు వరుసగా మూడోసారి మెజారిటీని అందించారని, ఇది ఒక రకమైన రికార్డు అని, దేశ అభ్యున్నతి కోసం నిరంతరం పని చేయాలని ఆదేశాన్ని ఇచ్చారని మోడీ పేర్కొన్నారు.
Through the election campaign, people across India added 'Modi Ka Parivar' to their social media as a mark of affection towards me. I derived a lot of strength from it. The people of India have given the NDA a majority for the third consecutive time, a record of sorts, and have…
— Narendra Modi (@narendramodi) June 11, 2024
"మనమందరం ఒకే కుటుంబం అనే సందేశాన్ని సమర్ధవంతంగా అందించినందున, నేను భారతదేశ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు మీరు ఇప్పుడు మీ సోషల్ మీడియా ప్రాపర్టీల నుండి 'మోదీ కా పరివార్'ని తొలగించాలని అభ్యర్థిస్తున్నాను. ప్రదర్శన పేరు మారవచ్చు, కానీ భారతదేశం యొక్క పురోగతి కోసం ప్రయత్నిస్తున్న ఒక పరివార్‌గా మా బంధం బలంగా మరియు పగలకుండా ఉంటుంది, "అని మోడీ ఎక్స్‌లో తెలిపారు.












Click it and Unblock the Notifications