ఉమ్మడి పౌరస్మృతికి మోడీ బాసట-రెండు చట్టాలపై దేశం పనిచేస్తుందా అని ప్రశ్న..
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పౌరస్మృతిని మ్యానిఫెస్టోలో చేర్చిన బీజేపీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ ఉమ్మడి పౌరస్మృతికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ చేపట్టిన 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మాట్లాడారు. 'ట్రిపుల్ తలాక్' ఇస్లాం నుండి విడదీయరానిదైతే, ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి మెజారిటీ ముస్లిం దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైన ఉమ్మడి పౌరస్మృతికి ప్రధాని మోడీ మద్దతు తెలిపారు. ఒక కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలను కలిగి ఉండటం పనికిరాదన్నారు. ఒక దేశం రెండు చట్టాలపై నడవదని అన్నారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.ట్రిపుల్ తలాక్ కోసం వాదించే వారు ఓటు బ్యాంకు కోసం ఆకలితో ఉన్న ముస్లిం కుమార్తెలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మోడీ తెలిపారు.
ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు సంబంధించినది కాదని, మొత్తం కుటుంబాలను కూడా నాశనం చేస్తుందన్నారు. ఎంతో ఆశతో కుటుంబసభ్యులు ఎవరితోనైనా పెళ్లి చేసుకున్న మహిళను ట్రిపుల్ తలాక్ చెప్పి వెనక్కి పంపేస్తే తల్లిదండ్రులు, సోదరులు ఆ మహిళ పట్ల ఎంతో ఆందోళనకు గురవుతున్నారని మోడీ తెలిపారు. కొందరు ముస్లిం ఆడపిల్లల్ని అణచివేయడానికి వారిపై ట్రిపుల్ తలాక్ ఉచ్చును వేలాడదీయాలనుకుంటున్నారు అని ప్రధాని వెల్లడించారు. అందుకే ముస్లిం సోదరీమణులు, కూతుళ్లు నేను ఎక్కడికి వెళ్లినా బీజేపీకి, మోదీకి అండగా నిలుస్తున్నారన్నారు.
ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించే వారిపై ప్రధాని విరుచుకుపడ్డారు. వారు తమ ప్రయోజనాల కోసం కొంతమందిని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఏ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టి నాశనం చేస్తున్నాయో భారతీయ ముస్లింలు అర్థం చేసుకోవాల్నారు. రాజ్యాంగం కూడా పౌరులందరికీ సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా సూచించిందన్నారు.
-
మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీశక్తికి పట్టాభిషేకం -
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!












Click it and Unblock the Notifications