షాక్: కేంద్ర ఆరోగ్య శాఖా గుజరాత్‌కే -మాండవీయకు ఛాన్స్ -కొత్త కేంద్ర మంత్రుల శాఖలివే

దేశ పరిపాలనకు సంబంధించి అతి కీలకమైన కేంద్ర కేబినెట్ లో మరో అతి ప్రధాన శాఖా గుజరాత్ కే దక్కింది. కరోనా విలయకాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా గుజరాత్ కు చెందిన మన్ సుఖ్ మాండవీయకు అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సారధి అయిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వంలో నంబర్ 2 అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ కు చెందినవారుకాగా, ఇప్పుడు ఆరోగ్య శాఖ సైతం ఆ రాష్ట్రానికే దక్కడం, మొత్తంగా కేంద్రంలో గుజరాత్ కు చెందిన ఏడుగురికి పదవులు దక్కడం గమనార్మం.

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు. వీళ్లందరికీ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. కరోనా వేళ అతి కీలకమైన ఆరోగ్య శాఖను మాండవీయకు అప్పగించారు. ఇక,

pm modi Cabinet reshuffle: Mansukh Mandaviya gets Health Ministry, New portfolios list

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అదనంగా నూతనంగా ఏర్పాటు చేసిన సహకార శాఖను కట్టబెట్టారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి పర్యాటక, సాంస్కృతిక శాఖతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను కూడా కేటాయించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులైన మాండవీయ ఇప్పటి దాకా చూసిన ఎరువులు, రసాయనాల శాఖను కూడా నిర్వహిస్తారు.

ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యా శాఖతోపాటు స్కిల్ డెవెలప్మెంట్ శాఖ కేటాయింపు. రైల్వే శాఖకు కొత్త మంత్రిగా అశ్విని వైష్ణవ్ నియామకం. ఐటీ శాఖను కూడా ఆయనకే కేటాయించారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు టెక్స్ టైల్స్, వినియోగ దారుల వ్యవహారాల శాఖలకూ అదనపు బాధ్యతలు ఆయనవే. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం మంత్రిత్వ శాఖతోపాటు అర్బన్ హౌజింగ్.

స్కృతి ఇరానీకి మహిళా, శిశు సంక్షేమం. ఆ శాఖకు సహాయ మంత్రిగా ముజపార మహేంద్రబాయి. జ్యోతిరాదిత్య సింధియాకు పౌరవిమానయానం. పురుషోత్తం రూపాలాకు డైరీ, ఫిషరీస్. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా మీనాక్షి లేఖి. క్రీడలు, యూత్ డెవెలప్మెట్ శాఖతోపాటు సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్.

దివంగత రాంవిలాస్ పాశ్వాన్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసిండ్ శాఖను ఆయన తమ్ముడు పశుపతినాథ్ పారస్ కు కేటాయించారు. గిరిరాజ్ సింగ్ కు గ్రామీణాభివృద్ది శాఖ, భూపేందర్ యాదవ్ కు కార్మిక శాఖ, పర్యావరణ, అటవీ శాఖలు అదనం. కిరన్ రిజిజికు న్యాయ శాఖ, సర్బానంద సోనోవాల్ కు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, షిప్పింగ్, జల రవాణా శాఖలు కేటాయింపు.

Recommended Video

    AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+