PM Modi: ఇరాన్ వార్ పై ఏం చేద్దాం?-ప్రధాని మోడీ అత్యున్నత భేటీ..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి మొదలుపెట్టిన యుద్దం, దానికి ప్రతీకారంగా టెహ్రాన్ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో భారతీయల పరిస్ధితి దారుణంగా మారిపోయింది. ఇప్పటికే దశాబ్దాలుగా అక్కడ ఉంటున్న భారతీయులతో పాటు తాజాగా అక్కడి పర్యాటక వీసాలపై వెళ్లిన వారు సైతం ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ తో భారత్ బంధం పెరుగుతోంది. దీంతో ఇరాన్, గల్ఫ్ దేశాల విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియని పరిస్ధితి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (pm modi) ఇవాళ రాత్రికి అత్యున్నత స్థాయి భేటీ నిర్వహిస్తున్నారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో ప్రధాని మోడీ భేటీ కాబోతున్నారు. ఇందులో ఆయన పశ్చిమాసియాలో తాజా పరిస్ధితిపై వివరాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్, రాజస్థాన్, పుదుచ్చేరి, తమిళనాడులో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రి 9.30కు ప్రధాని ఢిల్లీ చేరుకోబోతున్నారు. అనంతరం ఈ భేటీ నిర్వహిస్తారు.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ, టెహ్రాన్ అగ్ర నాయకత్వం మరణాల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగబోతోంది. ఇరాన్ దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులను ప్రయోగించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. ఖమేనీ హత్య ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఆయా దేశాల్లోని భారతీయుల పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు పశ్చిమాసియా విషయంలో భారత్ వైఖరిపైనా ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
-
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు












Click it and Unblock the Notifications