వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఫలితాలు: మోడీ ఫోన్, వచ్చి కలుస్తానని కేజ్రీ.. జనతా కా సీఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌కు స్వయంగా ఫోన్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ దూసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఏఏపీ 60 స్థానాల వరకు గెలుచుకోగా, బీజేపీ కేవలం ఏడెనిమిది స్థానాలకు పడిపోయింది.

కేజ్రీవాల్‌కు మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అభివృద్ధిలో కలిసి నడుద్దామని పేర్కొన్నారు. అందుకు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు.

జనతా కా సీఎం.. కేజ్రీవాల్

PM Modi calls and congratulates Kejriwal as AAP heads for landslide

న్యూఢిల్లీలోని పటేల్ నగర్‌లో ఉన్న ఏఏపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఏఏపీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద 'జనతా కా సీఎం' అంటూ కేజ్రీవాల్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.

2013 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 31, ఏఏపీ 28, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఏఏపీ దాదాపు అరవై స్థానాల వరకు గెలుచుకుంటుంది. బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.

English summary
Delhi election results live: PM Modi calls and congratulates Kejriwal as AAP heads for landslide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X