కులతత్వం, ప్రాంతీయ తత్వాల్ని రూపుమాపాలి-దసరా వేళ విపక్షాలకు మోడీ చురకలు..
వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ దేశంలో రాజకీయాలు ముదురుతున్నాయి. ముఖ్యంగా కుల గణన చేపట్టాలంటూ విపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి. విపక్షాలు అధికారంలో ఉన్న బీహార్ లో ఇప్పటికే కుల గణన చేపట్టి ఫలితాలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విపక్షాల కుల రాజకీయాలపై ఆగ్రహంగా ఉన్న ప్రధాని మోడీ దసరా సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో పరోక్ష విమర్శలు చేశారు.
కులతత్వం, ప్రాంతీయతత్వం వంటి సామాజిక వక్రీకరణలను నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

కనీసం ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడం సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు.ఇవాళ రావణ దహనం కేవలం దిష్టిబొమ్మ దహనం మాత్రమే కాకుండా కులతత్వం, ప్రాంతీయత పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నించే శక్తుల గురించి కూడా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
విజయదశమి పండుగ జాతికి చెందిన ప్రతి దుర్మార్గంపై దేశభక్తి విజయోత్సవ పండుగగా కూడా ఉండాలని ప్రధాని మోడీ కోరారు. సమాజంలోని చెడు, విపక్షను అంతం చేస్తామని కూడా ప్రతిజ్ఞ చేయాలన్నారు. అభివృద్ధి పథంలో కొత్త శక్తి, కొత్త తీర్మానాలతో ముందుకు వెళ్తామని తెలిపారు.. అందరం కలిసి 'శ్రేష్ఠ భారత్'ని రూపొందించాలని పిలుపునిచ్చారు. రామ మందిరంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ... సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామజన్మభూమిపై శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తుండటంతో ఈ రోజు మనం అదృష్టవంతులమని, ఇది మన సహనానికి సంకేతమని అన్నారు.












Click it and Unblock the Notifications