కరోనా ముప్పు తొలిగిపోలేదు - అప్రమత్తంగా ఉండాల్సిందే : సీఎంలతో ప్రధాని మోదీ..!!
మరోసారి కేసుల పెరుగుదలతో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం స్పష్టమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోవిడ్ -19 ప్రస్తుత స్థితి పైన ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్రాల వారీగా పరిస్థితుల పైన సమీక్ష చేసారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసారు. అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు.
Recommended Video

ప్రధాని మోదీ ఈ సమావేశం ద్వారా పలు కీలక సూచనలు చేసారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను దేశంలో మెరుగ్గా అదుపు చేయగలిగామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని ప్రధాని సూచించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 96 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు. ఇది ఖచ్చితంగా ప్రత్యేకంగా గర్వించాల్సిన అంశంగా పేర్కొన్నారు. ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు తరతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోవిడ్ బారిన పడకుండా చూసే రక్షణకవచం వ్యాక్సిన్లని ప్రధాని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ సవాళ్లను ఇంకా పూర్తి స్థాయిలో అధిగమించ లేదనే విషయం మాత్రం చాలా స్పష్టమని ముఖ్యమంత్రులను ప్రధాని అప్రమత్తం చేశారు. ఇప్పటికే చిన్నారులకు వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వటంతో...వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.












Click it and Unblock the Notifications