మోదీ మార్క్ గేమ్ షురూ, డీఎంకే కు తాజా సంకేతాలు - మారుతున్న లెక్కలు..!!
తమిళనాడులో కొత్త ప్రభుత్వం వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతూనే గతంలో అధికారంలో ఉన్న డీఎంకేను టార్గెట్ చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే విజయ్ పైన డీఎంకే గురి పెట్టింది. ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాల పైన స్పందించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేసారు. డీఎంకే ను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అదే సమయంలో డీఎంకే పైన ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో విజయ్ కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తమిళనాట రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అధికార దాహంతో డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, డీఎంకేల మధ్య 25-30 ఏళ్లుగా పొత్తు ఉందని... 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలన డీఎంకే వల్లే సాధ్యపడిందని చెప్పారు. డీఎంకే ఎప్పుడూ కాంగ్రెస్ మంచి కోసమే పని చేసిందని వివరించారు. పలు సందర్భాల్లో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్‌ను డీఎంకే గట్టెక్కించిందని గుర్తు చేసారు. కాంగ్రెస్ తీరు ప్రస్తుతం పరాన్నజీవిలా మారిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అవకాశం దొరకగానే మిత్రులను వంచిస్తోంది. కాంగ్రెస్ మనుగడకు మరో పార్టీ అవసరం అవుతోందని... తమిళనాడు ఎన్నికల ఫలితాలతో అవకాశం రాగానే డీఎంకేకు వెన్నుపోటు పోడిచిందని ప్రధాని మోదీ మండిపడ్డారు.

తమిళనాడులో కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్న బీజేపీ
40 ఏళ్ల క్రితం పార్లమెంటులో కాంగ్రెస్ సంఖ్యాబలం 400కు పైనే ఉండేదని మోదీ గుర్తు చేసారు. కానీ గత మూడు ఎన్నికల్లో వారికి 100 సీట్లు కూడా రావడం లేదని చెప్పుకొచ్చారు. తాము గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నామని... దేశవ్యాప్తంగా 21 చోట్ల బీజేపీ లేదా ఎన్డీయే అధికారంలో ఉంది. మాకు అభివృద్ధే మంత్రం కారణమిని మోదీ విశ్లేషించారు. కాంగ్రెస్‌కు మెసాలే తెలుసునని అన్నారు. ఆ పార్టీ గ్యారెంటీలన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పాలన పట్టదని దుయ్యబట్టారు. కేరళంలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉంది. కానీ ఐదేళ్లకు ఇద్దరు ముఖ్యమంత్రులా లేదా ఏడాదికి ఒక ముఖ్యమంత్రా అన్న ఫార్ములాపై ఎటూ తేల్చుకోలేకపోతోందని విమర్శించారు. గతంలో ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో జరిగినదే ఇటీవల కర్ణాటకలో కూడా జరిగిందని చెప్పారు. ఇప్పుడు కేరళంలో అదే పునరావృతం అవుతోందని చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ పైన ఫైర్ అవుతూనే.. డీఎంకే ఇచ్చిన సహకారం పైన మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీకి భవిష్యత్ పైన ఇస్తున్న సంకేతాలుగా విశ్లేషణలు మొదలయ్యాయి.













Click it and Unblock the Notifications