దేశంలో తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ‘మొధేరా’ను ప్రకటించిన ప్రధాని మోడీ
గాంధీనగర్: దేశంలోని తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలోని మొధేరా గ్రామం రికార్డుల్లోకి ఎక్కింది. ఆదివారం గుజరాత్ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ దేశంలోనే తొలి 24X7 సోలార్ విద్యుత్ గ్రామంగా మొహసానా జిల్లాల్లోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు.
మోధేరాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అంకితం చేశారు. ఈ సందర్భంగా.. శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటి వరకు సూర్య దేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసని.. ఇకపై దేశ ప్రజలంతా దీన్ని సూర్య గ్రామంగానే గుర్తిస్తారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ ఆదివారం నుంచి గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. అక్కడ రూ. 14,600 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నహాక సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
" మొత్తం విద్యుత్, నీరు నుంచి రహదారి, రైలు వరకు నేడు, మోధేరా, మెహసానా.. ఉత్తర గుజరాత్‌లో అభివృద్ధి కొత్త శక్తి నింపబడింది. డెయిరీ, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. శంకుస్థాపన చేయబడ్డాయి' అని ప్రధాన మంత్రి మోడీ వ్యాఖ్యానించారు.
Gujarat | Modhera, which is associated with the Sun Temple will also be known for its strides in solar energy. Big day for Modhera as it takes a giant leap towards harnessing solar power: PM Modi pic.twitter.com/bP8nXPbXYD
— ANI (@ANI) October 9, 2022
దేశంలో విరివిగా ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుని పునరుత్పాదక ఇంధనాన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. అన్ని రంగాల్లో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో అనేక వాహనాల తయారీ కంపెనీలు వెలిశాయన్నారు. త్వరలోనే విమానాలు తయారు చేసే కంపెనీలు కూడా వస్తాయన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications