వందే భారత్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్: మోదీ కీలక వ్యాఖ్యలు: కొత్త రైలుకు పచ్చజెండా

భోపాల్: మరో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. దీనితో దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 10 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు, నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే మరో రెండు రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ - తిరుపతి, చెన్నై-కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

ఇవ్వాళ ఆయన భోపాల్-న్యూఢిల్లీ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. భోపాల్‌లోని రాణి కమలపతి స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వందే భారత్ ప్రాజెక్ట్ ను ఎలా అందుబాటులోకి తీసుకుని వచ్చామనే విషయాన్ని వివరించారు.

PM Modi flagged off Bhopal-New Delhi Vande Bharat express train at Rani Kamlapati station

రైల్వేల్లో పలు దేశాల ఎంతో పురోగమించాయని, బుల్లెట్ రైళ్లను నడిపిస్తోన్నాయని అన్నారు. త్వరలోనే తాము కూడా ఆ స్థాయిని అందుకోనున్నామని చెప్పారు. దేశ నైపుణ్యానికి, సామర్థ్యానికి ఈ రైలు సర్వీస్ నిలువుటద్దమని చెప్పారు. ఆత్మనిర్భర్‌కు ప్రతీకగా అభివర్ణించారు. దేశాన్ని పరిపాలించిన గత ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడంలో తీరిక లేకుండా గడిపాయని ప్రధాని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ప్రజల అవసరాలు, ఆకాంక్షల కోసమే పని చేస్తోందని వ్యాఖ్యానించారు.

వందే భారత్ రైళ్లన్నీ కూడా వంద శాతం ఆక్యుపెన్సీ రేషియోను సాధిస్తోన్నాయని చెప్పారు ప్రధాని. ఈ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్లను జారీ చేసే విధానంలో కూడా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోన్నామని చెప్పారు. గతంలో ఏదైనా ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ను కొనుగోలు చేయాలంటే బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడాల్సి వచ్చేదని, వందే భారత్ విషయంలో ఇప్పటివరకు బ్లాక్ మార్కెటింగ్ నమోదైన సంఘటనలు లేవని అన్నారు.

దీన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ వందే భారత్ ప్రయాణికులతో ముచ్చటించారు. రైలు ఆపరేటర్లను కలిశారు. రైల్వేలో వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. వందే భారత్ నడిపించడానికి అవసరమైన శిక్షణను ప్రత్యేకంగా తీసుకున్నట్లు వారు వివరించారు. అనంతరం మోదీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- ఈ రైలును మోదీ ప్రారంభించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+