ప్రకాష్ రాజ్ కారును అడ్గుకుని పిడిగుద్దులు, ప్రధాని మోడీ, బీజేపీ క్యాన్సర్ లాంటిది, జస్ట్!

Posted By:
Subscribe to Oneindia Telugu
  ప్రకాష్ రాజ్ కారును అడ్గుకుని పిడిగుద్దులు, ప్రధాని మోడీ, బీజేపీ క్యాన్సర్ లాంటిది, జస్ట్!

  బెంగళూరు: ప్రముఖ బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటకలో ఎక్కడికి వెళ్లినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ వస్తున్నాడని తెలిసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కారును అడ్డుకుని పిడిగుద్దులతో దాడి చేశారు.

  అంబేద్కర్ జయంతి

  అంబేద్కర్ జయంతి

  కర్ణాటకలోని కలబురిగిలో గురువారం ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నిర్వహకులు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను ఆహ్వానించారు. గురువారం కలబురిగిలో జరిగిన అంబద్కేర్ జయంతి కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ హాజరైనారు.

   ప్రచారం చేశారు

  ప్రచారం చేశారు

  అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వస్తున్నాడని నిర్వహకులు కలబురిగిలో ప్రచారం చేశారు. ఈ విషయం బీజేపీ నాయకులు, కార్యకర్తలకు తెలిసింది. అంతే అంబేద్కర్ జయంత్రి జరుగుతున్న ప్రాంతానికి బీజేపీ కార్యకర్తలు వెళ్లారు.

  కారు మీద పిడి గుద్దులు

  కారు మీద పిడి గుద్దులు

  కార్యక్రమం ముగించుకున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సుమారు 15 మంది ప్రకాష్ రాజ్ కారును అడ్డగించారు. కారు ముందు భాగంలో చేతులతో పిడి గుద్దులు గుద్దిన బీజేపీ కార్యకర్తలు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు.

  భారత్ హిందువులది

  ప్రకాష్ రాజ్ కారుకు అడ్డంగా నిలబడిన బీజేపీ కార్యకర్తలు భారతదేశం హిందువులది, కర్ణాటక హిందువులది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో కారులో ప్రకాష్ రాజ్ తో పాటు మరికొంత మంది ఉన్నారు. పోలీసులు జోక్య చేసుకోవడంతో ప్రకాష్ రాజ్ కారు దిగకుండా అక్కడి నుంచి చిన్నగా వెళ్లిపోయారు.

  జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు

  జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు

  ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కొంత కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో సహ బీజేపీ నాయకులకు జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ క్యాన్సర్ లాంటిది, బీజేపీకి ఓటు వెయ్యరాదని తదితర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంలో ప్రకాష్ రాజ్ ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Actor Prakash Raj who started asking questions to Modi and BJP's Hinduthva ajenda was attaked by Modi fans in Kalburgi. Modi followers stops Prakash Raj's car and shows their anger.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి