ఎట్టకేలకు జీ7 సదస్సుకు మోడీకి ఆహ్వానం..! చివరి నిమిషంలో కెనడా ట్విస్ట్..!
కెనడాలో జరిగే ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి ఇప్పటివరకూ ఆహ్వానం అందలేదు. దీంతో ఈసారి భారత్ కు ఆహ్వానం లేనట్లేనని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ఇవాళ భారత ప్రధాని మోడీకి స్వయంగా కాల్ చేసి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రావాలని ఆహ్వానం పలికారు. దీంతో ప్రధాని మోడీకి వస్తానని హామీ ఇచ్చారు. దీంతో భారత్-కెనడా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.
కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నుంచి కాల్ అందుకోవడం ఆనందంగా ఉందని ప్రదాని మోడీ ట్వీట్ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఆయనకు అభినందనలు చెప్పానన్నారు. అలాగే ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. లోతైన వ్యక్తుల మధ్య సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, భారతదేశం మరియు కెనడా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గనిర్దేశం చేయబడి, పునరుద్ధరించబడిన శక్తితో కలిసి పనిచేస్తాయని తెలిపారు. శిఖరాగ్ర సమావేశంలో తమ మధ్య సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు మోడీ తెలిపారు.

గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ సింగ్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఈ హత్యలో భారత్ పాత్ర ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆ తర్వాత ఇరుదేశాలూ దౌత్యవేత్తల్ని బహిష్కరించుకున్నాయి. అలాగే చర్చల ప్రక్రియను పూర్తిగా నిలిపేశాయి. ఈ దశలో కెనడాలో ప్రధాని మార్పు జరిగింది. జస్టిన్ ట్రూడో స్ధానంలో వచ్చిన మార్క్ కార్నీ నేతృత్వంలో ఈసారి జీ7 సదస్సు ఈ నెల 13వ తేదీ నుంచి జరగనుంది. దీనికి భారత్ ను తొలుత ఆహ్వానించలేదు. అయితే విమర్శలు వస్తాయన్న భయంతో చివరి నిమిషంలో మోడీకి స్వయంగా ఫోన్ చేసి కెనడా ప్రధాని జీ7 సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీనికి మోడీ కూడా సరేనన్నారు.
Glad to receive a call from Prime Minister @MarkJCarney of Canada. Congratulated him on his recent election victory and thanked him for the invitation to the G7 Summit in Kananaskis later this month. As vibrant democracies bound by deep people-to-people ties, India and Canada…
— Narendra Modi (@narendramodi) June 6, 2025
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications