PM Modi: గల్ఫ్ సంక్షోభం మనకు నేర్పుతున్న పాఠం-మోడీ కామెంట్స్..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో గల్ఫ్ తీరం దద్దరిల్లుతోంది. నిత్యం గల్ఫ్ దేశాల్లో బాంబులు, డ్రోన్లు, మిస్సైళ్లతో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రధాని మోడీ (PM Modi) ఇవాళ తెలిపారు.
కేరళంలోని ఎర్నాకుళంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో మాట్లాడిన ప్రధాని మోడీ.. గల్ఫ్ ప్రాంతంలోని పరిస్థితిని బట్టి చూస్తే, మీ ఆందోళనలు సహజమే అన్నారు. లక్షలాది మంది మన సోదర సోదరీమణులు అక్కడ పనిచేస్తున్నారని, కానీ అధికారంలో ఉన్నది బిజెపి-ఎన్డిఎ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. మన పౌరులు వేరే దేశంలో చిక్కుకున్నప్పుడల్లా, వారికి సహాయం చేసేందుకు పూర్తి శక్తని ఉపయోగిస్తామన్నారు. ఇరాక్‌లోని నర్సులను రక్షించడం లేదా యెమెన్‌లోని ఉగ్రవాదుల నుండి ఫాదర్ టామ్‌ను రక్షించడం వంటివి కావచ్చన్నారు.

నేటి భారత్ సంక్షోభ సమయాల్లో తన పౌరులను ఒంటరిగా వదిలిపెట్టదని, నేటికీ ఈ సంఘర్షణలో చిక్కుకున్న భారతీయులకు భద్రత, సాధ్యమైన ప్రతి సహాయం లభించేలా చూసుకోవడమే మా ప్రయత్నం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సంక్షోభాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శం అన్నారు. అటు గల్ఫ్ సంక్షోభం మనకు మన కాళ్ల మీద నిలబడాలనే (ఆత్మనిర్భర్ భారత్ ) పాఠం నేర్పుతోందన్నారు. కోవిడ్ అయినా, ఉక్రెయిన్ యుద్దమైనా, ఇరాన్ యుద్ధమైనా మనకు నేర్పుతున్న పాఠం ఇదే అన్నారు.












Click it and Unblock the Notifications