కష్టకాలంలో దేశానికి అద్భుత నాయకత్వం: పీవీపై మోడీ, నేడు 97వ జయంతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. పీవీ నర్సింహా రావు ఓ రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. దేశ కష్టకాలంలో పీవీ అద్భుతమైన నాయకత్వం అందించారన్నారు. పీవీ లోతైన పరిజ్ఞానం, విజ్ఞత కలిగిన వ్యక్తి అన్నారు.
పీవీ నర్సింహా రావు బహుభాషా కోవిదుడు, నూతన ఆర్ధిక సంస్కరణలను దేశానికి పరిచయం చేసిన ఆర్ధిక వేత్త అని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు.

మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన ఘనత పీవీదే అన్నారు. పీవీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసం కాదన్నారు.
పీవీ నర్సింహా రావు చిత్రపటానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏఫీ భవన్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. భారతదేశానికి ప్రధానులుగా చేసిన వారందరిలో పీవీది ప్రత్యేక శైలి అన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు.
-
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications