కొత్త లుక్ లో ప్రధాని మోదీ - సఫారీ, టోపీ ధరించి..!!

ప్రధాని మోదీ కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సఫారీ దుస్తులు, టోపీలో ప్రత్యక్షమయ్యారు. కర్ణాటకలోని బంధీపూర్ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించేందుకు ఆయన ఈ లుక్ లో కనిపించారు. ప్రాజెక్ట్ టైగర్‌ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ప్రాజెక్టు టైగర్‌ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకలోని మైసూరులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు.

PM Modi at Bandipur Tiger Reserve

ప్రధాని 'అమృత్ కాల్' సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విజన్‌ను విడుదల చేసి మరియు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబిసిఎ) ను కూడా ప్రధాని నేడు ప్రారంభించనున్నారు. ది ఎలిఫెంట్ విస్పర్స్ డ్యాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లో నటించిన బొమ్మన్, వల్లితో పాటు ఏనుగు (రఘు) ని కూడా ప్రధాని కలవనున్నారు.

ఇంకో విషయం ఏంటంటే తెప్పకాడు లోని ఏనుగు సంరక్షణ కేంద్రం లో ఉన్న సిబ్బందిని కూడా ఆయన సత్కరించనున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ వచ్చాక చాలమంది తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

అలాగే అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌లోని కొంతభాగం చామరాజనగర్‌ జిల్లా.. మరికొంత భాగం మైసూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 1973లో పులుల్ని వాటి ఆవాసాల్ని రక్షించేందుకు రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిసరాలను విస్తరించి 880 చదరపు కిలోమీటర్లతో ప్రాజెక్ట్‌ టైగర్‌ను ప్రారంభించారు.

PM Modi at Bandipur Tiger Reserve

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3,000 పులులు ఉన్నాయి. ప్రపంచ పులుల లో 70 శాతానికి పైగా మనదేశంలోనే ఉన్నాయి. తాజా అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య సంవత్సరానికి 6 శాతం చొప్పున పెరిగిందని అధికారులు ప్రస్తుతం బంధీపూర్ టైగర్‌ రిజర్వ్‌ విస్తీర్ణం 912 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. అంతరించిపోతున్న ఆసియా అడవి ఏనుగులకు ఇదే చివరి ఆశ్రయం. ఈ టైగర్‌ రిజర్వ్‌లో ఎన్నో అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతులు కనిపిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+