వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం : ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. పాస్‌పోర్టు లేని వారికి శుభవార్త

|
Google Oneindia TeluguNews

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం ఇది మూడోసారి.

ప్ర‌ధాని కీల‌క స‌మావేశం

ప్ర‌ధాని కీల‌క స‌మావేశం


రష్యా బాంబుల దాడితో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌లో వేలాదిమంది భారతీయులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడ‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదు విమానాల్లో సుమారు 1200 మందిని స్వదేశానికి తరలించింది. ఈనేపథ్యంలో మరింత వేగంగా భారతీయులను తీసుకోచ్చేందుకు తీసుకోవాల్సిన చర్చలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

 ఉక్రెయిన్ పొరుగుదేశాల‌కు కేంద్ర‌మంత్రులు

ఉక్రెయిన్ పొరుగుదేశాల‌కు కేంద్ర‌మంత్రులు


ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శకంర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు కేంద్రమంత్రులు, అధికారులు వెళ్లి భారతీయుల తరలింపులో సమన్వయం చేసుకోవాలని మోదీ సూచించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని స్వదేశానికి తీసుకువస్తామని ప్రధాని మోదీ తెలిపారు. విద్యార్థుల‌ త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని భ‌రోసా ఇచ్చారు.

పాస్‌పోర్టు లేనివారికి శుభ‌వార్త‌

మరోవైపు వివిధ కారణాలతో పాస్ పోర్టు లేక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారిని ఇండియాకు తీసుకువచ్చే విష‌యంలో విదేశీ వ్యవహారాల శాఖ అత్యవసర సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా వెల్లడించారు. పాస్ పోర్టులు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పాస్ పోర్టులు లేని భారతీయులకు అత్యవసర సర్టిఫికెట్లు విదేశాంగ శాఖ అధికారులు జారీ చేస్తారని చెప్పారు.

English summary
PM Modi High level meeting on Russia - Ukarine war
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X