మోదీ సమర శంఖం: భీకరంగా తయారైన బోర్డర్: ప్రధాని నివాసంలో ఏం జరుగుతోంది?

India Pakistan War: పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

PM Modi hold meeting in his official residence Delhi

తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలోచీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.

ఈ పరిణామాలతో భారత్- పాకిస్తాన్ సరిహద్దు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీకరంగా తయారయ్యాయి. రెండు దేశాలు కూడా సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లల్లో తలదాచుకోవాలనీ సూచించింది.

దేశ రాజధానిలో ప్రధాన పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ దీనికి కేంద్ర బిందువు అయింది. మోదీ కొద్దిసేపటి కిందటే అత్యున్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. రక్షణ, విదేశాంగ, జాతీయ భద్రత సలహా మండలి.. వంటి శాఖలు, విభాగాలకు చెందిన అధికారులు దీనికి హాజరయ్యారు.

కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ఏర్పాటైంది. ప్రధాని మోదీ నివాసానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రత సలహాదారు అజితో దోవల్, త్రివిధ దళాధిపతులు ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (వైమానిక దళం)..ఈ భేటీకి హాజరయ్యారు.

పాకిస్తాన్ భూభాగంపై ఇఫ్పటివరకు జరిగిన వైమానిక దాడులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమీక్షించారు. శతృదేశానికి ఎంత మేర నష్టం వాటిల్లింది? ఉగ్రవాద శిబిరాలు ఎంత వరకు ధ్వంసం అయ్యాయి? ఈ దాడిలో సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఆరా తీయనున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+