ఎన్నికలొస్తోన్నాయ్: కొత్త మెట్రో లైన్‌కు జెండా ఊపిన మోదీ.. ట్రావెల్

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మే 12వ తేదీన పోలింగ్ జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తోన్నాయి. జిల్లాల్లో పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా ఇవ్వాళ విడుదల చేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్లు ఈ తొలి జాబితాలో ఉన్నాయి. కనకపురా నుంచి డీకే శివకుమార్, మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తోన్నారు. ప్రస్తుతం వరుణ స్థానానికి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

PM Modi inaugurates Whitefield- Krishnarajapura Metro section in Bengaluru and travelled by train

కోలార్ నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఇక కనకపురా- డీకే శివకుమార్ కు పెట్టని కోట. వరుసగా మూడుసార్లు ఆయన ఇక్కడి నుంచి గెలుపొందారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కర్ణాటకలో అడుగు పెట్టారు. నెల రోజుల వ్యవధిలో ఆయన కర్ణాటక పర్యటనకు రావడం ఇది మూడోసారి. ఇదివరకు శివమొగ్గలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం మండ్యలో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

హుబ్బళ్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులనూ ఆయన ప్రారంభించారు. ఇవ్వాళ మోదీ బెంగళూరులో పర్యటించారు. కొత్త మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. వైట్ ఫీల్డ్- కృష్ణరాజపుర 13.50 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కొత్త మెట్రో రైల్వే లైన్ ను మోదీ ప్రారంభించారు. అనంతరం అందులో ప్రయాణించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాడుగోడి మెట్రో స్టేషన్ లో కౌంటర్‌లో టిక్కెట్‌ను కొనుగోలు చేశారు మోదీ. వైట్‌ ఫీల్డ్ నుంచి శ్రీ సత్యసాయి హాస్పిటల్ స్టేషన్ వరకు ట్రావెల్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ- కొందరు విద్యార్థులు, మెట్రో రైల్ ఉద్యోగులు, కార్మికులతో ముచ్చటించారు. మెట్రో రైలు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+