ట్రంప్ కు మోదీ మార్క్ షాక్..: దెబ్బకు దిగిరావాల్సిందే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్ పెట్టనున్నారు ప్రధాని మోదీ. త్వరలోనే చైనా పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చైనా సుప్రీమ్ గ్ఝి జిన్ పింగ్ తో ముఖాముఖి భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు.

PM Modi is likely to meet Chinese President Xi Jinping

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి మోదీ ఈ నెల 31వ తేదీన చైనాకు బయలుదేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు టియాన్జియాన్ లో బస చేయనున్నారు. దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లబోతోండటం ఇదే తొలిసారి.

2020లో వీటిని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్ బాబు అమరుడయ్యారు.

ఈ ఘర్షణలు జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద చాలాకాలం పాటు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చైనాలో పర్యటించారు. ఆ దేశ పౌరులకు విసాలను సైతం కేంద్రం పునరుద్ధరించింది.

డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ చైనా పర్యటన చేపట్టారు. జిన్ పింగ్ తో సమావేశం కానున్నారు. ఇవి- డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇరు దేశాల వాణిజ్యం, కనెక్టివిటీ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలపై చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తన్మయ్ లాల్ తెలిపారు.

ఈ ఆదివారమే టియాంజియాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీ ఏర్పాటు కానుంది. 20 మందికి పైగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇందులో పాల్గొననున్నారు. మధ్య- ఆసియా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు హాజరవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+