మోడీని ఓడించడం కష్టమేమీ కాదు : సోనియా గాంధీ.. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్

రాయ్‌బరేలీ : కాంగ్రెస్ కు కంచుకోటైన రాయ్‌బరేలీ సెగ్మెంట్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి ఆమె నాలుగు సార్లు గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమైన నియోజకవర్గం కావడం.. ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీచేస్తుండటంతో ఇటువైపు దేశవ్యాప్త దృష్టి మళ్లుతుంది. సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో.. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ఉన్నారు.

నామినేషన్ ప్రక్రియ తర్వాత సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడం చాలా కష్టమా అంటూ విలేఖర్లు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. 2004 లో వాజ్‌పేయి మీద గెలిచిన విషయం మరచిపోవద్దన్నారు.

PM Modi is not at all invincible says sonia gandhi while raebareli nomination

అనంతరం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీమాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఓడించడం అపొజిషన్ పార్టీలకు కష్టమని వ్యాఖ్యానించారు. గడిచిన ఐదేళ్లలో దేశ ప్రజలకు మోడీ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆయన సామర్థ్యం, పనితనం గురించి ఎన్నికల ఫలితాల తర్వాత క్లియర్ పిక్చర్ వస్తుందని ఎద్దేవా చేశారు.

నామినేషన్ సందర్భంలో వంశపారపర్యంగా పాటిస్తున్న పూజావిధానాలు పాటించారు సోనియా. 1967 లో ఇందిరాగాంధీ తొలిసారిగా ఈ పూజ నిర్వహించాకే.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+