Parliament: విపక్షాలపై నిప్పులు చెరిగిన మోడీ-నిరసనలతో అడ్డుకున్న ఇండియా కూటమి..!

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఇవాళ లోక్ సభలో మరోసారి వాడీవేడీ వాతావరణం నెలకొంది.ప్రధాని మోడీ ప్రసంగానికి లేవగానే విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నినాదాలతో లోక్ సభను హోరెత్తించాయి. దీనికి బీజేపీ సహా ఎన్డీయే పక్షాలు కూడా కౌంటర్ గా రంగంలోకి దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. చివరికి ప్రధాని మోడీ తాను చెప్పాల్సింది చెప్పి ముగించారు.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ప్రసంగించేందుకు ప్రధాని మోడీ సిద్దం కాగానే విపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ముఖ్యంగా మణిపూర్ హింస, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి.దీంతో ఓ దశలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష నేత రాహుల్ గాంధీని మందలించాల్సి వచ్చింది. అనంతరం ప్రధాని మోడీ రాహుుల్ ను ఉద్దేశించి కొందరి బాధను తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. తమపై అసత్యాలు ప్రచారం చేసిన తర్వాత కూడా విపక్షాలు ఓటమిని రుచి చూశాయని మోడీ విమర్శించారు. భారత ప్రజలు మూడోసారి తనకు పనిచేసే అవకాశం ఇచ్చారన్నారు.

pm modi lashed out at opposition over attack against nda amid uproar in loksabha

మణిపూర్ నినాదాలను చేస్తున్న విపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోడీ.. ఈ దేశం బుజ్జగింపు రాజకీయాలను చూసింది కానీ తాము సంతృప్తి రాజకీయాలు చేశామని, బుజ్జగింపు రాజకీయాలు కావన్నారు. అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకపోవడమే తమ మంత్రం అన్నారు. హిందూ సంస్కృతిని తప్పుబట్టడాన్ని కొందరు ఫ్యాషన్ గా మార్చుకున్నారంటూ రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+