ఆసక్తికరంగా సాగిన ప్రధాని మోదీ 2024 చివరి మన్ కీ బాత్... హైలైట్స్ ఇవే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 117వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. 2024 సంవత్సరంలో ఇది చివరి ఎపిసోడ్ . ఈ సంవత్సరం లోక్సభ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కాలేదు. ఆ తరువాత నవంబర్ 24వ తేదీన 116 ఎపిసోడ్ ప్రసారం చేయబడింది. ఇక ఇది ప్రస్తుతం ఈ సంవత్సరం నేడు ప్రధాని మాట్లాడిన చివరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

75 సంవత్సరాల రాజ్యాంగం
117 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరం వచ్చేసిందని ఈ సంవత్సరం జనవరి 26నటికి మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయని ఇది మన అందరికీ గర్వకారణమని అన్నారు. భారత రాజ్యాంగం మనకు మార్గదర్శక మార్గదర్శకంగా నిలిచిందని దాని కారణంగానే ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడగలుగుతున్నానని మోదీ తెలిపారు.

PM Modi s last Mann Ki Baat of 2024 was interesting Here are the highlights

దేశ పౌరులకు ప్రధాని మోదీ పిలుపు
ఈ క్రమంలో ఈ మైలు రాయిని పురస్కరించుకొని దేశవ్యాప్త ప్రచారం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను చదవడానికి వారి వీడియోలను పంచుకోవడానికి పౌరులను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక ఇదే సమయంలో జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా నిర్వహించబోతున్నామని, ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏఐ చాట్ బాట్ మొదటిసారిగా కుంభమేళా ఈవెంట్లో ఉపయోగించబడుతుందని తెలిపారు.

కే టి బి భారత్ హై హమ్ గురించి మోదీ చెప్పిందిదే
ఇక పిల్లలకు ఇష్టమైన యానిమేషన్ సిరీస్ కే టి బి భారత్ హై హమ్ గురించి తప్పక తెలుసుకోవాలని, ఇప్పుడు దాని రెండవ సీజన్ కూడా వచ్చిందని దూరదర్శన్ తో పాటు ఇతర ఓటిటి ప్లాట్ ఫాం లలో కూడా వీటిని చూడవచ్చునని తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఎవరికి తెలియని పోరాట యోధుల గురించి ఈ సీరియస్ లో చెబుతారని నరేంద్ర మోదీ వెల్లడించారు.

ఒడిస్సా రైతుల స్ఫూర్తి దాయక కథనం
ఒడిస్సా రాష్ట్రంలోని కలహండి రైతులు స్వయంకృషితో సాధించిన విజయాలు ప్రస్తావించారు.గతంలో రైతులు వలస వెళ్ళే పరిస్థితులు ఉన్నచోట, నేడు కలహండిలోని గోలముండా బ్లాక్ కూరగాయల కేంద్రంగా మారిందని, కేవలం 10 మంది రైతులతో కూడిన చిన్న సమూహంతో ప్రారంభమై, ఈ బృందం కిసాన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్' అనే పేరుతో రైతు ఉత్పత్తి సంస్థను స్థాపించిందనే విషయం ప్రధాని మోదీ వెల్లడించారు. ఇలా అనేక అంశాలను నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+