చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ వేడుకకు జయ మిస్: కారణం అదేనా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశంలో పేదరిక నిర్మూనలకు చేనేత పరిశ్రమ ఓ అస్త్రం కానుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తొలిసారి జాతీయ చేనేత దినోత్సవాన్ని చెన్నైలోని మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత చేనేత బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. అంతకు ముందు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చెన్నైలోని మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనశాలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ 75 మంది చేనేత వృత్తి దారులకు సంత్‌ కబీర్‌ పురస్కారాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ భారత్‌లో తయారైన చేనేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందాయని అన్నారు. భారత్‌లో పేదరిక నిర్మూనలకు చేనేత పరిశ్రమ ఓ అస్త్రం అవుతుందని చెప్పారు.

పోచంపల్లి చేనేత పరిశ్రమ గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు.సినిమా నటులు తమ ప్రతి ఐదు సినిమాల్లో ఒక చిత్రంలో చేనేత, చేతి ఉత్పత్తులను వాడితే బాగుంటుందని, అవి ప్రజల దృష్టని ఆకర్షిస్తాయని అన్నారు.

PM Modi launches National Handloom Day in Chennai

ప్యాషన్‌కు ప్రాచుర్యం కల్పించడంలో సినీ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రస్తుతం యువత ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తోందని, చేనేత వస్త్రాలను కూడా అన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ప్రధాని మోడీ సూచించారు.

మార్కెట్లో చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, తదితరలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ వేడుకను మద్రాస్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు నుంచి వెయ్యి మంది చేనేత కార్మికులను ఆహ్వానించారు. ఈరోజు మధ్యహ్నాం పోయస్ గార్డెన్‌లోని సీఎం జయలలిత నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు.

జయలలితతో ప్రధాని మోడీ సుమారు 50 నిమిషాలు పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తమిళనాడుకు చెందిన సమస్యల గురించి వినతిపత్రాన్ని ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితి ఆరోగ్యం ఇంకా కుదుటపడినట్టు లేదు.

అందుకేనేమో మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోడీకి విమానాశ్రయంలో గవర్నర్ రోశయ్యతో కలసి జయలలిత ఘన స్వాగతం పలికారు.

అయితే ఆమె తరుపున కార్యక్రమానికి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా, జయలలిత ప్రసంగ పాఠాన్ని పన్నీర్ సెల్వం చదివి వినిపించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి జయలలిత గైర్హజరవడం పట్ల ఆమె ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని భావిస్తున్నారు.

English summary
Security has been beefed up all over Chennai on the eve of the one-day visit of Prime Minister Narendra Modi to launch the First National Handloom Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X